Advertisement

  • నడుస్తున్న ట్రక్కు నుంచి చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

నడుస్తున్న ట్రక్కు నుంచి చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

By: chandrasekar Wed, 30 Sept 2020 11:28 AM

నడుస్తున్న ట్రక్కు నుంచి చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్


చిత్తూరు జిల్లా నగరి వద్ద కంటైనర్‌లో మొబైల్‌ ఫోన్లు దోపిడీ చేసిన దొంగల ముఠా ఆటకట్టించారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ జిల్లాలో దొంగల ముఠాలోని ముగ్గురు సభ్యులను పట్టుకున్నారు. నిందితులు పేరుమోసిన కంజరభట్‌ అంతర్రాష్ట్ర బందిపోటు ముఠాగా పోలీసులు గుర్తించారు. గత నెలలో కంటైనర్‌ నుంచి రూ.7 కోట్ల విలువైన మొబైల్‌ఫోన్లను ఈ దోపిడీ ముఠా చాకచక్యంగా దోచుకెళ్లారు.

ట్రక్కు రోడ్డుపై వెళ్తుండగానే వెనుక నుంచి మొబైల్ ఫోన్లను చోరీ చేసి దోచుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన చిత్తూరు పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ దొంగల ముఠా మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ.సెంథిల్ కుమార్ పర్యవేక్షణలో ఓ టీం రంగంలోకి దిగింది. నెల రోజుల పాటు వీరి కోసం సినీ ఫక్కీలో కాపుగాసి, అక్కడి పోలీసుల సాయంతో ఎట్టకేలకు నిందితులను అరెస్ట్‌ చేశారు. దోపిడీ చేసిన మొబైల్‌ ఫోన్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Tags :
|

Advertisement