Advertisement

  • రేపటినుంచి నాన్‌ కొవిడ్‌ రోగులకు సేవలు ప్రారంభించనున్న గాంధీ ఆసుపత్రి...

రేపటినుంచి నాన్‌ కొవిడ్‌ రోగులకు సేవలు ప్రారంభించనున్న గాంధీ ఆసుపత్రి...

By: chandrasekar Sat, 21 Nov 2020 3:17 PM

రేపటినుంచి నాన్‌ కొవిడ్‌ రోగులకు సేవలు ప్రారంభించనున్న గాంధీ ఆసుపత్రి...


సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో రేపటి నుంచి నాన్‌ కొవిడ్‌ రోగులకు సేవలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో గడిచిన మార్చి 2న మొదటి కొవిడ్‌ కేసు నమోదైంది. అప్పటి నుండి గాంధీ ఆస్పత్రి కరోనా‌ పాజిటివ్‌ రోగులకు మాత్రమే సేవలు అందిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో ఎనిమిది నెలల విరామం అనంతరం గాంధీలో రేపటి నుండి నాన్‌ కొవిడ్‌ రోగులకు కూడా తిరిగి సేవలు ప్రారంభం కానున్నాయి. ఔట్‌ పేషెంట్స్‌, ఇన్‌ పేషెంట్స్‌, ఎమర్జెన్సీ సర్వీసులు శనివారం తిరిగి ప్రారంభం అవుతాయి. ఈ మేరకు అధికారులు ఇప్పటికే అన్ని రకాల చర్యలు చేపట్టారు.

గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజా రావు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ఒకవైపు కరోనా‌ పాజిటివ్‌ రోగులకు మరోవైపు నాన్‌ కొవిడ్‌ రోగులకు ఒకేసారి చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. నాన్‌ కొవిడ్‌ రోగుల దృష్ట్యా అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌(డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి ఆస్పత్రిని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేర్వేరు ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు సందర్శనకు అనుమతి లేదు. మాస్కులు లేకుండా అనుమతించరు. విజిటింగ్‌ అవర్స్‌ లేవు. నాన్‌ కొవిడ్‌ రోగుల వెంబడి ఒక్క సహాయకుడిని మాత్రమే అనుమతించనున్నారు.

Tags :

Advertisement