Advertisement

  • సమ్మె విరమించిన గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బంది

సమ్మె విరమించిన గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బంది

By: Sankar Wed, 15 July 2020 10:02 PM

సమ్మె విరమించిన గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ సిబ్బంది



హైదరాబాద్ న‌గ‌రంలోని గాంధీ ఆస్పత్రిలో పని చేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్ల పరిష్కారం కోసం విధులు బహిష్కరించి నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ర్ట ప్రభుత్వం వీరితో బుధవారం చర్చలు జరిపింది. ఈ చర్చలు ఎట్టకేల‌కు స‌ఫ‌ల‌ం కావడంతో.. గ‌త ఆరు రోజుల నుంచి చేస్తున్న స‌మ్మెను విరమిస్తున్నట్లు సిబ్బంది ప్రకటించారు. వెంటనే తాము విధుల్లోకి చేరతామ‌ని చెప్పారు.

ఈ చర్చల్లో భాగంగా న‌ర్సుల‌కు వేత‌నాన్ని రూ.17,500ల నుంచి రూ.25 వేల‌కు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. క‌రోనా విధుల్లో ఉన్నవారికి రోజువారీ ప్రోత్సాహకం కింద అదనంగా మరో రూ.750 ఇవ్వాల‌ని నిర్ణయించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ సిబ్బందిగా మార్చేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నాలుగో త‌ర‌గ‌తి సిబ్బందికి రోజుకు రూ.300 ఇన్సెంటివ్ కాగా, నెలలో 15 రోజులు డ్యూటీ చేసేలా వెసులుబాటు క‌ల్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రభుత్వ హామీల‌తో స‌మ్మెను విరమిస్తున్నట్లుగా న‌ర్సులు ప్రకటించారు.

అయితే కరోనా వచ్చిన తర్వాత గాంధీ ఆసుపత్రిలో కరోనా ట్రీట్మెంట్ జరుగుతుండటంతో అందులో పనిచేసే అవుట్ సోర్చింగ్ సిబ్బంది పగలు రాత్రి అనే తేడా లేకుండా పోరాడుతున్నారు ..అయితే ఇంత పోరాడుతున్న తమను ఎవరు పట్టించుకోవడం లేదు అని వాపోయిన సిబ్బంది సమ్మెకు దిగిన విషయం తెల్సిందే

Tags :
|
|
|

Advertisement