Advertisement

  • ఆగస్టు 21 నుంచి జరిగే ఆన్‌లైన్‌ వేలంలో గాంధీ కళ్లద్దాలు

ఆగస్టు 21 నుంచి జరిగే ఆన్‌లైన్‌ వేలంలో గాంధీ కళ్లద్దాలు

By: chandrasekar Mon, 10 Aug 2020 7:21 PM

ఆగస్టు 21 నుంచి జరిగే ఆన్‌లైన్‌ వేలంలో గాంధీ కళ్లద్దాలు


ఆగస్టు 21 నుంచి జరిగే ఆన్‌లైన్‌ వేలంలో మహాత్మా గాంధీ కళ్లద్దాలు లండన్‌లో అమ్మకానికి రాబోతున్నాయి. అంతకు ముందు ఇవి ఓ వేలం సంస్థ లెటర్‌ బాక్స్‌లో అనామకంగా పడి ఉన్నాయి. ఓ తెలుపు రంగు కవరులో చుట్టి లెటర్‌ బాక్సులో పడేసి ఉన్న ఈ కళ్లద్దాలను 'ఈస్ట్‌ బ్రిస్టల్ ఆక్షన్స్' అనే సంస్థ ఉద్యోగి ఒకరు గుర్తించారు. ఈ కళ్లద్దాలు సుమారు 15,000 పౌండ్ల మన దేశం విలువలో సుమారు రూ. 15,00,000 ధర పలికే అవకాశం ఉందని వేలం సంస్థకు చెందిన అధికారి ఆండ్రూ స్టోవ్‌ అన్నారు.

ఈ కళ్లద్దాలు తమ కంపెనీ చరిత్రలోనే అతి విలువైన వస్తువుగా అభివర్ణించారు. కళ్లద్దాల విలువ ఎంతో చెప్పినప్పుడు, దాని యజమానికి గుండె ఆగినంత పనైంది అని స్టోవ్‌ చెప్పారు. శుక్రవారం రాత్రి ఒక వ్యక్తి వచ్చి ఈ కళ్లద్దాలను లెటర్‌ బాక్స్‌లో పెట్టారు. సోమవారం వరకు అతను అక్కడే వేచి ఉన్నారు. మా ఉద్యోగి ఒకరు ఆ కళ్లద్దాలను నాకు అందజేశారు. అందులో ఉన్న ఒక నోట్‌లో ఇవి గాంధీ కళ్లద్దాలు అని రాసి ఉంది అని స్టోవ్‌ వెల్లడించారు. అది చూడగానే ఇదేదో బాగుందనిపించింది మళ్ళీ రోజంతా దాని గురించే ఆలోచించాను అని స్టోవ్‌ చెప్పారు.

కళ్లద్దాల వివరాలు తెలిసికోవడానికి ఆరా తీయగా బంగారు తాపడం చేసిన ఈ గుండ్రని కళ్లజోడు భారత స్వాతంత్ర ఉద్యమ నాయకుడు మహాత్మా గాంధీది అని తేలింది. ఈ విషయం నాకు అర్దమయ్యాక కుర్చీలో నుంచి కింద పడిపోయినంత పనయ్యిందని స్టోవ్‌ తెలిపారు. నేను ఆ తర్వాత ఆ కళ్లద్దాలు అందించిన వ్యక్తికి ఫోన్‌ చేసి వాటి విలువ చెప్పాను. బహుశా అతనికి గుండెపోటు వచ్చి ఉంటుందిఅని స్టోవ్‌ వ్యాఖ్యానించారు. ఇవి కొన్ని తరాలుగా తమ ఇంట్లో ఉంటున్నాయని, తమ బంధువులలో ఒకరు 1920లో గాంధీని దక్షిణాఫ్రికాలో కలిశారని ఆ కళ్లజోడు తెచ్చిన వ్యక్తి వెల్లడించారు.

కళ్లజోడు తెచ్చిన వ్యక్తి చెప్పిన తేదీలు, సంఘటనల వివరాలు పోల్చుకున్నాం. ఆ తేదీల్లో గాంధీ ఆ కళ్లజోడు ధరించి కనిపించారు అని స్టోవ్‌ వెల్లడించారు. గాంధీ వాడిన ఆ కళ్లజోడు చూడటానికి చాలా బలహీనంగా కనిపిస్తున్న మొదటి కళ్ల జోళ్లలో ఒకటి అయ్యుండవచ్చని స్టోవ్‌ చెప్పారు. ఆయనకు తన వస్తువులను ఇతరులకు ఇచ్చే అలవాటుందని అన్నారు. ఈ కళ్లద్దాల గురించి చాలామంది అడుగుతున్నారని, ముఖ్యంగా ఇండియా నుంచి చాలా మంది వాకబు చేస్తున్నారని, ఇవి తన దగ్గరకు చేరడం అదృష్టంగా భావిస్తున్నానని స్టోవ్‌ అన్నారు. చిన్న కవర్‌లో పెట్టి ఉన్నాయి కావున సులభంగా వాటిని ఎత్తుకుపోవచ్చు, లేదంటే జారిపోవచ్చు, లేదంటే చెత్తబుట్టలో కూడా పడేయవచ్చు. కానీ ఇది మా కంపెనీకి వచ్చిన అతి విలువైన వస్తువని.

స్టోవ్‌ తెలిపారు. ఈ కళ్లద్దాలను ఆగస్టు 21 నుంచి జరిగే ఆన్‌లైన్‌ వేలంలో ఆక్షన్‌కు పెట్టబోతున్నారని తెలియజేసారు. మన జాతి పిత వాడిన ఈ కళ్లజోడు చాలా ప్రముఖమైనదిగా తెలిపారు.

Tags :
|
|

Advertisement