Advertisement

కరోనా ప్రభావంతో గాంధీ భవన్ మూసివేత ..

By: Sankar Wed, 15 July 2020 4:54 PM

కరోనా ప్రభావంతో గాంధీ భవన్ మూసివేత ..



హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోన్న వేళ.. దాని ప్రభావం రాజకీయ పార్టీలపైనా పడుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌ను మూసివేశారు. గాంధీ భవన్లో పని చేసి సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే అప్రమత్తమైన నాయకులు వారం రోజులపాటు గాంధీ భవన్‌ను మూసివేయాలని నిర్ణయించారు. గాంధీ భవన్‌లో కరోనా కేసు నమోదైందన్న సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది పరిసరాలను శానిటైజ్ చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనూ చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. గాంధీ భవన్ ట్రెజరర్ గూడురు గూడురు నారాయణ రెడ్డికి కరోనా సోకగా.. సీనియర్ నేత వి. హనుమంత రావుకు కూడా కరోనా సోకింది. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నేత నరేందర్ యాదవ్ కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రగతి భవన్, రాజ్‌భవన్‌లలోనూ భారీ సంఖ్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. గవర్నర్‌కు కోవిడ్ నెగటివ్ అని రిపోర్ట్ రాగా.. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లి ఈ మధ్య ప్రగతి భవన్‌కు వచ్చారు.

Tags :
|
|
|
|

Advertisement