Advertisement

  • కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పై తీవ్ర విమర్శలు చేసిన గౌతమ్ గంభీర్

కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పై తీవ్ర విమర్శలు చేసిన గౌతమ్ గంభీర్

By: Sankar Mon, 30 Nov 2020 1:37 PM

కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పై తీవ్ర విమర్శలు చేసిన గౌతమ్ గంభీర్


ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియా లో జరుగుతున్న వన్ డే సిరీస్ లో టీం ఇండియా వరుసగా రెండు వన్ డేలలో ఓటమి చవిచూసి సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే...బాట్స్మెన్ పోరాడినప్పటికీ బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో టీమిండియా కు ఓటమి తప్పలేదు...ఈ ఓటమితో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.

ఈ వన్డేల్లో కెప్టెన్‌గా కోహ్లి వైఫల్యం పూర్తిగా కనబడిందని మండిపడ్డాడు. ప్రధానంగా టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా చేత బౌలింగ్‌ చేయించిన విధానాన్ని గంభీర్‌ తప్పుబట్టాడు. తొలి స్పెల్‌లో బుమ్రాకు రెండు ఓవర్లు ఇవ్వడం పూర్‌ కెప్టెన్సీకి నిదర్శమన్నాడు.

బుమ్రా తన మొదటి స్పెల్‌లో ఏడు పరుగులిచ్చిన క్రమంలో అతని చేత కంటిన్యూగా బౌలింగ్‌ ఎందుకు చేయించలేదని ప్రశ్నించాడు. ఆసీస్‌ వంటి పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ కల్గిన జట్టుపై ఆడేటప్పుడు వికెట్లు తీసే ఒత్తిడి పెంచాలని, ఈ మ్యాచ్‌లో కోహ్లి వికెట్లు సాధించడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కనబడలేదన్నాడు....

Tags :
|
|
|

Advertisement