Advertisement

  • నటి గౌతమి ఇంట్లో ఓ అపరిచిత వ్యక్తి చెసిన గలాటా...

నటి గౌతమి ఇంట్లో ఓ అపరిచిత వ్యక్తి చెసిన గలాటా...

By: chandrasekar Wed, 18 Nov 2020 5:07 PM

నటి గౌతమి ఇంట్లో ఓ అపరిచిత వ్యక్తి చెసిన గలాటా...


ఓ దుండగుడు సీనియర్ నటి గౌతమి ఇంట్లో చొరబడటం అక్కడ కలకలం రేపింది. గౌతమి చెన్నైలోని కొట్టివక్కమ్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి ఆమె ఇంట్లోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు.

ఓ గోడ పక్కన దాక్కుని ఉన్న అతడిని అదే ఇంట్లో పనిచేసే సతీష్ అనే వ్యక్తి గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో నీలంకరై పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అనుమానితుడిని అరెస్ట్ చేశారు.

ఓ గోడ పక్కన దాక్కుని ఉన్న అతడిని అదే ఇంట్లో పనిచేసే సతీష్ అనే వ్యక్తి గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో నీలంకరై పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అనుమానితుడిని అరెస్ట్ చేశారు.

అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు విచారించగా అనేక విషయాలు వెల్లడించాడు. అతడిని కొట్టివాక్కం కుప్పం ప్రాంతానికి చెందిన పాండియన్‌గా గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడంతో పాటు గలాటా చేసినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Tags :
|
|

Advertisement