Advertisement

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల తరువాతే జీ 7 శిఖరాగ్ర సమావేశాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల తరువాతే జీ 7 శిఖరాగ్ర సమావేశాలు

By: chandrasekar Wed, 12 Aug 2020 5:56 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల తరువాతే జీ 7 శిఖరాగ్ర సమావేశాలు


కరోనా కారణంగా ఇంతకముందే వాయిదా పడ్డ జీ 7 శిఖరాగ్ర సమావేశాలు ఈసారి ఏకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల తరువాతే జరపాలని నిర్ణయం తీసికొన్నారు. సెప్టెంబర్‌లో జరుగనున్న జీ 7 శిఖరాగ్ర సమావేశాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. నవంబర్ మూడో తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి ఈ ఏడాది మార్చిలో అమెరికాలోని క్యాంప్ డేవిడ్‌లో జీ 7 సమ్మిట్ జరగాల్సి ఉన్నది. అయితే, కరోనా కారణంగా సభ్య దేశాల నాయకులు వ్యక్తిగతంగా రావడం సాధ్యం కాలేదు.

వాయిదా పడ్డ అనంతరం జూన్ నెలలో ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పిలవాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు అధ్యక్ష ఎన్నికలు వస్తుండటంతో సెప్టెంబర్‌ తర్వాతనే జరుపుతామని ట్రంప్ తెలిపారు. జీ-7 లో అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఇటలీ ఉన్నాయి. అన్ని సభ్య దేశాలు వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇస్తాయి. ఈ సంవత్సరం యూఎస్ లో జరుగబోతోంది.

ఇప్పటివరకు జీ-7 సమావేశాలకు రావాల్సిందిగా ఎవరికీ వైట్ హౌస్ ఇంకా అధికారికంగా ఆహ్వానం పంపలేదని ట్రంప్ తెలియజేసారు. ఈసారి జీ-7 లో అధికారిక సభ్యులు కాని దేశాలను కూడా ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు ప్రకటించారు. అవి ఏ దేశాలు అని ఇంకా ప్రకటించలేదు.

Tags :
|

Advertisement