Advertisement

జీ5 ప్రీమియం కంటెంట్‌ ఉచితం...రిలయెన్స్ జియో

By: chandrasekar Sat, 27 June 2020 1:29 PM

జీ5 ప్రీమియం కంటెంట్‌ ఉచితం...రిలయెన్స్ జియో


జియోఫైబర్ సెట్ టాప్ బాక్స్ యూజర్లకు జీ5 ప్రీమియం కంటెంట్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు రిలయెన్స్ జియో ప్రకటించింది. జియోఫైబర్ సెట్ టాప్ బాక్స్ ఉపయోగిస్తున్నవారు జీ5 ప్లాట్‌ఫామ్‌లోని అన్ని భాషల కంటెంట్‌ను ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు. జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో 1.25 లక్షల గంటల కంటెంట్‌తో పాటు 100 లైవ్ టీవీ ఛానెళ్లు ఉంటాయి.

జియోఫైబర్ సిల్వర్ క్వార్టర్లీ కన్నా ఎక్కువ ప్లాన్స్‌లో ఉన్న యూజర్లు జీ5 ప్రీమియం కంటెంట్‌ను అన్‌లిమిటెడ్‌గా యాక్సెస్ చేయొచ్చు. ప్రస్తుతం జియోఫైబర్ సెట్ టాప్ బాక్స్ ఉపయోగిస్తున్నవారితో పాటు కొత్తవారికి కూడా ఈ ఆఫర్ లభిస్తుంది. జియోఫైబర్ యూజర్లు క్వార్టర్లీ లేదా యాన్యువల్ సిల్వర్ ప్లాన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. వారికి లాగిన్ చేయాల్సిన అవసరం లేకుండా జీ5 ప్రీమియం కంటెంట్‌ కనిపిస్తుంది.

కొత్త జియోఫైబర్ యూజర్లు మంత్లీ సిల్వర్ ప్లాన్ తీసుకుంటే మొదటి మూడు రీఛార్జుల వరకు మాత్రమే జీ5 ప్రీమియం కంటెంట్‌ లభిస్తుంది. ఇక ప్రస్తుతం సిల్వర్ క్వార్టర్లీ కన్నా ఎక్కువ ప్లాన్స్‌లో యాక్టీవ్‌లో ఉన్నవారు కూడా జీ5 ప్రీమియం కంటెంట్‌ చూడొచ్చు. ఇక అందరు గోల్డ్ ప్లాన్ సబ్‌స్క్రైబర్లు జీ5 ప్రీమియం కంటెంట్‌ పొందొచ్చు. అయితే గోల్డ్ ప్లాన్ తీసుకున్నవారికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని రిలయెన్స్ జియో తెలిపింది.

జియోఫైబర్ గోల్డ్ ప్లాన్‌ తీసుకునేవారికి 250 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డేటా నెలకు 1,750 జీబీ వరకు ఉపయోగించొచ్చు. ఈ లిమిట్ పూర్తైన తర్వాత డేటా స్పీడ్ తగ్గుతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉచితం. జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలివ్, సన్‌నెక్స్‌ట్, వూట్, ఆల్ట్ బాలాజీ, లైయన్స్‌గేట్, హోయ్‌చోయ్, షెమారూమ్, జియోసినిమా, జియోసావన్ లాంటి ప్రీమియం ఓటీటీ అప్లికేషన్స్‌కు యాక్సెస్ పొందొచ్చు. అన్‌లిమిటెడ్ వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్ ఉచితం. అన్ని జియో అప్లికేషన్లకు అన్‌లిమిటెడ్ యాక్సెస్ లభిస్తుంది.

Tags :
|

Advertisement