Advertisement

  • మరింతగా క్షీణించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం

మరింతగా క్షీణించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం

By: chandrasekar Fri, 25 Sept 2020 08:55 AM

మరింతగా క్షీణించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం


కరోనా వల్ల హాస్పిటల్లో చేరిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్తుతం తన ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. కొన్ని రోజులుగా ఈయన ఆరోగ్యం బాగానే ఉందంటూ తనయుడు ఎస్పీ చరణ్ చెప్తూ వస్తున్నాడు. అయితే తాజాగా మళ్లీ ఆయన ఆరోగ్యం విషమించిందని తెలుస్తుంది. ఈ మేరకు ఎంజిఎం వైద్యులు ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ బారిన పడి ఆగస్ట్ 5న చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చేరాడు. అక్కడే చికిత్స తీసుకుంటున్న ఈయనకు ఫిజియోథెరపీ చికిత్స కూడా చేస్తున్నారని చరణ్ తెలిపాడు. తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉందని చెప్తున్న నేపథ్యంలో ఉన్నట్లుండి విషమించిందనే న్యూస్ బయటికి వచ్చింది. బాలు ఆరోగ్యం కొన్ని రోజులుగా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికీ బాలు ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. ఇప్పటికీ ఈయన పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ఇప్పుడు అది మరింత విషమించిందని తెలుస్తుంది. దాంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటలుగా అయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.

SPB కి గత కొంత కాలంగా లైఫ్ సపోర్ట్ పరికరాలతో చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా ఎక్మో (ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సిస్టమ్‌తో బాలుకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. అంటే పేషెంట్ గుండె, ఊపిరితిత్తులకు అదనపు మద్దతు అందించడం అన్నమాట. అలా బాలుకు చికిత్స చేస్తున్నారు. హార్ట్ అండ్ లంగ్స్ బైపాస్ కింద పని చేస్తుందన్నమాట. కృత్రిమ ఊపితిత్తుల ద్వారా రక్తాన్ని శరీరానికి సరఫరా చేస్తుంది. విదేశీ వైద్యులు ఈయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఊపిరితిత్తులలోకి వెంటిలేటర్ ఆక్సీజన్ నిండిన గాలిని పంపిస్తే ఈసీఎంఓ పంప్స్ రక్తంలో కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించి ఆక్సీజన్ నింపిన రక్తాన్ని పంపిణి చేస్తుంది. దానివల్ల పేషెంట్ శరీరం చికిత్సకు స్పందించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ పద్దతినే బాలు కోసం వాడుతున్నారు వైద్యులు. ఇదంతా చూస్తుంటే బాలు పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని అర్థమవుతుంది. ఆయన త్వరగా కోలుకోవాలని సంగీత అభిమానులు, సినిమా ప్రముఖులు ప్రార్థనలు చేస్తున్నారు. చాలా భాషల్లో ఈయన పాటలు పాడి చాల మంది అభిమానులను సంపాదించారు. ఇంత వయసులో కూడా చాలా గొప్పగా పాడే ఈయన అనారోగ్యం పాలవడంతో అభిమానులు చాలా నిరాశకులోనయ్యారు.

Tags :

Advertisement