Advertisement

ఢిల్లీ హైకోర్టు కార్యకలాపాలు సస్పెండ్

By: Sankar Mon, 29 June 2020 7:38 PM

ఢిల్లీ హైకోర్టు కార్యకలాపాలు సస్పెండ్


ఢిల్లీలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదు అవుతున్న తరుణంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది..జూలై 15వ తేదీ వరకూ హైకోర్టు, సబార్డినేట్ కోర్టుల కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సస్పెన్షన్‌కు పొడిగిస్తున్నట్టు పేర్కొంది.

ఢిల్లీలోని ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా హైకోర్టు, జనరల్ సూపర్‌విజన్ కమిటీ కార్యకలాపాలతో పాటు, సబార్డినేట్ కోర్టుల కార్యకలాపాలు జూలై 15 వరకూ సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. సస్పెండ్ అయిన పనిదినాల్లో కోర్టు ముందు పెండింగ్‌‌లో ఉన్న కేసులను వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.

అయితే, అత్యవసరంగా విచారణ జరపాల్సిన కేసుల విచారణ మాత్రం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా చేపడతామని తెలిపింది. కాగా, జూన్ 30 వరకూ కోర్టు కార్యకలాపాలను సస్పెండ్ చేస్తూ సంబంధిత కమిటీ గతంలో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులను సోమవారంనాడు తిరిగి పరిగణనలోకి తీసుకుంటూ సస్పెన్షన్‌ను జూలై 15 వరకూ పొడిగించింది.

Tags :
|

Advertisement