Advertisement

  • భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్

భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్

By: Sankar Sun, 18 Oct 2020 3:11 PM

భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్


గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. నగర శివారులోని పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి.

చాలా ప్రాంతాలకు విద్యుత్ పునరుద్దరించలేదు. భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారులపైకి వరదనీరు చేరడంతో, పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. జాతీయ రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ బెంగళూరు హైవేలపై ట్రాఫిక్ జామ్ అయ్యింది.

హైదరాబాద్ లో భారీవర్షాల ధాటికి పలు చోట్ల రోడ్లు దెబ్బతినడంతో రోడ్లను భారీకేడ్లతో మూసేశారు. మలక్ పేట్ రైల్ వంతెన రోడ్డు, గడ్డి అన్నారం-శివగంగ రోడ్డు, మూసారాంబాగ్ వంతెన, చాదర్ ఘాట్ రోడ్, పురానాపూల్ 100 ఫీట్ రోడ్, టోలి చౌకి రోడ్లును మూసేశారు.

Tags :

Advertisement