Advertisement

  • జూన్ నెల నుండి పూర్తి వేతనాలు: తెలంగాణ ప్రభుత్వం

జూన్ నెల నుండి పూర్తి వేతనాలు: తెలంగాణ ప్రభుత్వం

By: chandrasekar Wed, 24 June 2020 5:30 PM

జూన్ నెల నుండి పూర్తి వేతనాలు: తెలంగాణ ప్రభుత్వం


జూన్ నెల నుండి పూర్తి జీతాలు, పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్& కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక సభ్యులు ఇవాళ హరీష్ రావును ఆయన నివాసంలో కలిశారు.

జీతాల్లో కోతలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఎలాంటి కటింగ్ లు లేకుండా పూర్తి సాలరీ చెల్లించాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి ఉద్యోగ, ఉపాధ్యాయుల అందరికీ జూన్ నెల నుండి పూర్తి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడానికి అంగీకరించారు.

అంతేకాదు బకాయిలకు సంబంధించి జిపిఎఫ్ లో జమ చేయాలనుకుంటున్నామని చెప్పారు. అయితే సిపిఎస్, పెన్షనర్లకు ఎలా ఇస్తారనే దానిపై వారి బకాయిలు ఇన్ స్టాల్ మెంట్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నట్లు తెలిపారు మంత్రి హరీష్.

ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన బకాయిలు కూడా జిపిఎఫ్ లో కాకుండా నగదు రూపంలోనే ఇవ్వాలని మంత్రి హరీష్ ను ఐక్యవేదిక పక్షాన కోరారు.

Tags :
|
|

Advertisement