Advertisement

  • ఫుకుషిమా రేడియోయాక్టివ్ నీటిని స‌ముద్రంలోకి వదలనున్నారు...!

ఫుకుషిమా రేడియోయాక్టివ్ నీటిని స‌ముద్రంలోకి వదలనున్నారు...!

By: chandrasekar Sat, 17 Oct 2020 6:01 PM

ఫుకుషిమా రేడియోయాక్టివ్ నీటిని స‌ముద్రంలోకి వదలనున్నారు...!


ఫుకుషియా అణు రియాక్ట‌ర్‌లోని రేడియోధార్మిక నీటిని స‌ముద్రంలోకి వ‌ద‌ల‌నున్నారు. ఫుకుషిమా న్యూక్లియ‌ర్ ప్లాంట్ 2011లో వ‌చ్చిన భూకంపం వ‌ల్ల ధ్వంసం అయిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ప్లాంట్‌లో ట్రీట్మెంట్‌కు గురైన రేడియో యాక్టివ్ నీటిని ఎక్క‌డ వ‌ద‌లాల‌న్న చ‌ర్చ చాలా రోజులు జరిగింది. ప‌వ‌ర్ స్టేష‌న్‌ను శుద్ధి చేసేందుకు వాడే నీటిని కూడా స‌ముద్రంలో వ‌దిలేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసారు.

ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు, ఫిషింగ్ సంఘాలు ఈ ప్ర‌ణాళిక‌లను వ్య‌తిరేకించినా దీని వ‌ల్ల నష్టం స్వ‌ల్పంగానే ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేద‌ని జ‌పాన్ ప్ర‌భుత్వం ప్రకటించింది. ప్లాంట్‌లో రేడియో యాక్టివిటీని త‌గ్గించేందుకు సుమారు మిలియ‌న్ ట‌న్నుల నీటిని వినియోగించారు. అయితే ఆ రేడియో ధార్మిక జ‌లాన్ని 2022 నుంచి స‌ముద్రంలోకి రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు.

Tags :
|

Advertisement