Advertisement

  • బీటెక్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉచితంగా టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ

బీటెక్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉచితంగా టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ

By: chandrasekar Tue, 15 Dec 2020 10:56 AM

బీటెక్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉచితంగా టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ


బీటెక్, డిగ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉపాధి చేకూరేవిధంగా వీరికి తెలంగాణా ప్రభుత్వం ఉచితంగా టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల సాంకేతిక మరియు వృత్తి పరమైన నైపుణ్యాలను మెరుగు పరచడం కోసం వీరికి ఉచితంగా ఆన్‌లైన్ కోర్సుల్లో శిక్షణ అందించనున్నారు. వృత్తి విద్యా కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉపాది అవకాశం కల్పించుటకు ప్రముఖ సాఫ్ట్ వెర్ మరియు హార్డ్ వెర్ దిగ్గజ కంపెనీ అయిన ఐబీఎం తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందువల్ల అభ్యర్థులు కోర్స్ పూర్తిచేసిన తరువాత సాఫ్ట్ వెర్ కంపెనీలలో ఉద్యోగాలు పొందవచ్చును.

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం మరియు టాస్క్ - తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో విద్యార్థులకు లేటెస్ట్ కోర్స్ లైన సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి కోర్సులను ఫ్రీగా అందించనున్నారు. ఇందుకోసం దాదాపు 30 వేలమంది విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ అందించనున్నారు. దీనిలో శిక్షణ పొందుటకు విద్యార్థుల వయస్సు 18 నుండి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి https://open.ptech.org వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవలసి వుంది. ఈ కోర్సులో చేరుటకు బయట ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Tags :
|

Advertisement