Advertisement

  • కరోనా రోగుల కోసం చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో ఉచితంగా ప్లాస్మా

కరోనా రోగుల కోసం చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో ఉచితంగా ప్లాస్మా

By: Sankar Tue, 29 Sept 2020 4:53 PM

కరోనా రోగుల కోసం చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో ఉచితంగా ప్లాస్మా

మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ , ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కరోనా బారిన పడిన రోగులకు ఉచిత ప్లాస్మాను తన బ్లడ్ బ్యాంకు ద్వారా వితరణ చేసేందుకు సిద్దమైయ్యారు మెగాస్టార్.

కరోనా సోకి కోలుకున్నవారు ఫ్లాస్మాదానం చేస్తే మరికొంతమందికి ఆయుష్షు పోసినట్లే. ఈ నేపధ్యంలో పేదలైన కరోనా సోకిన రోగులకు ఉచితంగా ఫ్లాస్మా వితరణ చేసేందుకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంది.తెల్ల రేషన్ కార్డులు, ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేద రోగులకు ప్లాస్మాను ఉచితంగా తన బ్లడ్ బ్యాంక్ ద్వారా సరఫరా చేస్తున్నామని.. అర్హులైన ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెగాస్టార్ కోరారు.

చిరంజీవి తన సొంత నిధులతో బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి రక్తం దానం చేసి ప్రాణదాతగా నిలిచారు.కరోనా అసమయంలోనూ ఎన్నో సేవల చేశారు మెగాస్టార్ . టాలీవుడ్ సినీ కార్మికులను ఆదుకునేందుకు సీసీసీ ద్వారా నిత్యావసర సరుకులను పలుమార్లు అందించారు మెగాస్టార్ .

Tags :
|

Advertisement