Advertisement

  • ఏపీఎస్‌ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉచిత బస్‌ పాస్‌ సౌకర్యం

ఏపీఎస్‌ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉచిత బస్‌ పాస్‌ సౌకర్యం

By: chandrasekar Fri, 18 Dec 2020 11:15 AM

ఏపీఎస్‌ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉచిత బస్‌ పాస్‌ సౌకర్యం


ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ లో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉచిత బస్‌ పాస్‌ సౌకర్యం కల్పించారు. ఇందుకోసం ఔట్ సోర్సింగ్ సిబ్బంది గత కొంత కాలం నుండి ఉచిత బస్ పాస్ కోసం ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం వీరికి సానుకూలంగా స్పందించి సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్ మరియు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించుటకు ఉచిత బస్ పాస్ సోకార్యాన్ని కలిగించింది.

దీని కోసం రానున్న సంవత్సరం జనవరి 1 తేదీ నుండి ఈ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ఔట్ సోర్సింగ్ సిబ్బంది డిపోలు, యూనిట్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 5 వేల మంది ఔట్‌ సోర్సింగ్ సిబ్బంది ఆర్టీసీ లో పనిచేషున్నారు. వీరు తమ సొంత ఖర్చులతో వారి నివాస ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. ఈ ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని వినియోగించుకొని తమ నివాస ప్రాంతం నుండి 25 కి.మీ.లోపు బస్సుల్లో వీరు ప్రయాణించవచ్చు. ఇందువల్ల ఈ సిబ్బందికి తమ ఖర్చులు తగ్గనుంది.

Tags :
|
|

Advertisement