Advertisement

  • గీత ఆర్ట్స్ పేరు చెప్పి అమ్మాయిలని మోసం చేస్తున్న కేటుగాడు ..

గీత ఆర్ట్స్ పేరు చెప్పి అమ్మాయిలని మోసం చేస్తున్న కేటుగాడు ..

By: Sankar Fri, 10 July 2020 11:39 AM

గీత ఆర్ట్స్ పేరు చెప్పి అమ్మాయిలని మోసం చేస్తున్న కేటుగాడు ..



సెల‌బ్రిటీల పేర్లు చెబుతూ అమ్మాయిల‌కి వ‌ల వేయ‌డం ఈ మ‌ధ్య కాలంలో బాగా జ‌రుగుతుంది. కొద్ది రోజుల క్రితం ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి పేరు చెప్పి అమ్మాయిల‌ని మోసం చేసిన విష‌యం వెలుగులోకి వచ్చింది.. తాను తీయబోయే మల్టీస్టారర్ సినిమాలో రెండో హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని చెప్పి తన పేరిట ఒక నెంబర్ నుంచి కొంత మంది అమ్మాయిలకు కాల్స్ వెళ్లాయని అజయ్ భూపతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాళ్లను అమ్మాయిలు నమ్మొద్దని అజయ్ ఒక వీడియో మెసేజ్‌ను కూడా విడుదల చేశారు, తాజాగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పేరుతో అమ్మాయిల‌కు ఓ ప్ర‌బుద్ధుడు వ‌ల వేశాడు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పేరుతో ఒక కేటుగాడు అమ్మాయిలకు వల వేస్తున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన తమిళ్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం కల్పిస్తానంటూ అమ్మాయిలకు వల విసురుతున్నాడు..గీతా ఆర్ట్స్‌లో తాను డిజైనర్, మేకప్ మేన్‌ అని చెప్పుకుంటూ అమ్మాయిల‌కి అనేక మాట‌లు చెప్పి మోసం చేశాడు.

ఈ విష‌యం గీతా ఆర్ట్స్ బేన‌ర్ దృష్టికి రావ‌డంతో వెంట‌నే గీతా ఆర్ట్స్ మేనేజ‌ర్ స‌త్య సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. మోసం చేసిన వ్య‌క్తి వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడ‌డంతో అత‌ని లోకేష‌న్ ట్రేసింగ్ చేసే ప‌నిలో ప‌డ్డారు పోలీసులు.


Tags :
|

Advertisement