Advertisement

  • పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన ఫ్రాన్స్ …భారత్‌కు ప్రయోజనం కలిగించేలా కీలక నిర్ణయం

పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన ఫ్రాన్స్ …భారత్‌కు ప్రయోజనం కలిగించేలా కీలక నిర్ణయం

By: chandrasekar Sat, 21 Nov 2020 5:49 PM

పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన ఫ్రాన్స్ …భారత్‌కు ప్రయోజనం కలిగించేలా కీలక నిర్ణయం


ఫ్రాన్స్‌ పాకిస్థాన్‌కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. పాకిస్థాన్‌ మిరాజ్‌ యుద్ధ విమానాలను ఉన్నతీకరించబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా భారత్‌కు ప్రయోజనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులు, మత సంఘర్షణలపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన మిరాజ్ ఫైటర్ జెట్లను ఆధునికీకరించబోమని, వాయు రక్షణ వ్యవస్థను, అగస్త్యా 90బి శ్రేణికి చెందిన సబ్‌మెరైన్లను ఉన్నతీకరించబోమని ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఆ దేశానికి తేల్చి చెప్పారు.

అంతేకాకుండా రఫేల్‌ యుద్ధ విమానాలను మరమ్మతు చేయించేటప్పుడు పాక్‌ మూలాలున్న సాంకేతిక నిపుణులను దగ్గరకు రానివ్వొద్దని ఖతార్‌కు సూచించింది. రఫేల్ యుద్ధ విమానాలను భారత్, ఫ్రాన్స్‌తో పాటు ఖతార్ వినియోగిస్తోంది. ఖతార్ నుంచి రఫేల్ ఫైటర్ జెట్లకు సంబంధించిన వివరాలను సేకరించిన పాక్ ఇప్పటికే ఆ సమాచారాన్ని చైనాకు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రధాని నిర్ణయం భారత్‌కు లబ్ధి చేకూర్చనుంది. చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు ఇది మరింత ఉపయోగపడనుంది.

Tags :

Advertisement