Advertisement

ఆంక్ష‌లు ఎత్తివేసిన ఫ్రాన్స్‌

By: chandrasekar Tue, 16 June 2020 4:20 PM

ఆంక్ష‌లు ఎత్తివేసిన ఫ్రాన్స్‌


క‌రోనా వైర‌స్ వ‌ల్ల లాక్‌డౌన్ వేళ క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం వాటిని దాదాపు ఎత్తివేసింది. ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు అధ్య‌క్షుడు ఎమ్మాన్యువ‌ల్ మాక్ర‌న్ ప్ర‌క‌టించారు. సోమ‌వారం నుంచి కేఫ్‌లు, రెస్టారెంట్లు సంపూర్ణంగా తెరుచుకోనున్నాయి. ఇత‌ర యూరోప్ దేశాల‌కు ప్ర‌యాణించేందుకు అనుమ‌తి కూడా ఇచ్చారు. రిటైర్మెంట్ హోమ్స్‌లో ఉన్న‌వారి కుటుంబ‌స‌భ్యుల్ని క‌లిసేందుకు అనుమ‌తి జారీ చేశారు. కోవిడ్‌19 వ‌ల్ల ఫ్రాన్స్‌లో చాలా క‌ఠిన‌మైన ఆంక్ష‌లు అమ‌లు చేశారు.

టీవీలో జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించిన మాక్ర‌న్‌ ఫ్రాన్స్ తొలి విజ‌యం సాధించిన‌ట్లు చెప్పారు. కానీ వైర‌స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కూడా ఆయ‌న ప్ర‌జ‌ల్ని హెచ్చ‌రించారు. అత్య‌ధిక కేసులు న‌మోదు అయిన పారిస్‌లోనూ లాక్‌డౌన్ ఎత్తివేస్తున్న‌ట్లు మాక్ర‌న్ తెలిపారు. జూన్ 22వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా స్కూళ్ల‌ను రీఓపెన్ చేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 2020 వేస‌వి కాలం మొద‌లైంద‌ని, కానీ వైర‌స్ పురోగ‌తిని ప‌రీక్షించాల్సి ఉంద‌న్నారు.

Tags :
|
|

Advertisement