Advertisement

  • కాశ్మీర్ లో ఎన్కౌంటర్ ..నలుగురు ఉగ్రవాదులు హతం

కాశ్మీర్ లో ఎన్కౌంటర్ ..నలుగురు ఉగ్రవాదులు హతం

By: Sankar Fri, 28 Aug 2020 8:09 PM

కాశ్మీర్ లో ఎన్కౌంటర్ ..నలుగురు ఉగ్రవాదులు హతం


జమ్ము కశ్మీర్‌లోని సోపియన్‌ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కిలూరి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగరు ఉగ్రవాదులు మరణించారని జమ్ము కశ్మీర్‌ పోలీసులు నిర్ధారించారు.

కిలూర గ్రామంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు, పోలీసులు అక్కడికి చేరుకోగా గాలింపు బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు మరణించారని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు దాగిఉన్నారనే అనుమానంతో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. కాగా ఈ ఏడాది కశ్మీర్‌లో 26 మంది ఉగ్రవాద సంస్ధల టాప్‌ కమాండర్లు సహా 150 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి

గతంలో జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేసి.. టెర్రరిస్ట్‌గా మారిన షాకూర్ అహ్మద్ పర్రే కూడా ఈ కాల్పుల్లో చనిపోయినట్లు గుర్తించారు. షాకూర్ అహ్మద్ నాలుగున్నరేళ్ల క్రితం అనంతనాగ్ జిల్లాలోని బిజ్బేహర పోలీస్ స్టేషన్ నుంచి నాలుగు ఏకే-47 తుపాకీలతో పరారయ్యాడు..అనంతరం అల్ బదర్ అనే ఉగ్రవాద గ్రూప్‌ను ఏర్పాటు చేసి.. షోపియాన్ జిల్లా కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. ముందు స్పెషల్ పోలీసు ఆఫీసరుగా పని చేసి.. తర్వాత కానిస్టేబుల్.. ఆపై ఉగ్రవాదిగా మారిన షాకూర్.. పది మందిని యువకులను ఉగ్రవాదులుగా మార్చాడు. వీరిలో ఇప్పటికే ఐదుగుర్ని మట్టుబెట్టామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.

Tags :
|

Advertisement