Advertisement

  • ఢిల్లీలో పేలుళ్ల‌కు పథకం ర‌చ‌న... నిఘావ‌ర్గాల స‌మాచారంతో న‌లుగురు ఉగ్రవాదులు అరెస్ట్

ఢిల్లీలో పేలుళ్ల‌కు పథకం ర‌చ‌న... నిఘావ‌ర్గాల స‌మాచారంతో న‌లుగురు ఉగ్రవాదులు అరెస్ట్

By: chandrasekar Mon, 05 Oct 2020 3:24 PM

ఢిల్లీలో పేలుళ్ల‌కు పథకం ర‌చ‌న... నిఘావ‌ర్గాల స‌మాచారంతో న‌లుగురు ఉగ్రవాదులు అరెస్ట్


ఢిల్లీలో పేలుళ్ల‌కు పథకం ర‌చ‌న చేసిన న‌లుగురు ఉగ్రవాదులు నిఘావ‌ర్గాల స‌మాచారంతో అరెస్ట్ చేయబడ్డారు. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో పేలుళ్ల‌కు ప‌థ‌క ర‌చ‌న చేసిన న‌లుగురు ఉగ్ర‌వాద సానుభూతిప‌రుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిఘావ‌ర్గాల స‌మాచారంతో ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో వారిని అరెస్టు చేశామ‌ని, వారంతా క‌శ్మీర్ చెందిన యువ‌కుల‌ని, వారినుంచి నాటు తుపాకులు, 120 రౌండ్ల బుల్లెట్లు, పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని డీసీపీ ప్ర‌మోద్ సింగ్ కుశ్వాహ్ తెలిపారు. నిందితుల‌ను పుల్వామాకు చెందిన అల్తాఫ్ అహ్మ‌ద్ దార్ (25), షోపియాన్‌కు చెందిన‌ ముస్తాక్ అహ్మ‌ద్ గ‌నీ (27), ఇశ్వాక్ మ‌జీద్ కోకా (28), అక్విబ్ స‌ఫి (22)గా గుర్తించామ‌ని చెప్పారు.

అరెస్ట్ చేయబడ్డ న‌లుగురు యువ‌కులు నిషేధిత అన్సార్ ఘ‌జ్వ‌త్ అల్ హింద్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన సానుభూమిత‌ప‌రుల‌ని వెల్ల‌డించారు. ఇశ్వాక్ మ‌జీద్ కోకా అన్సార్ ఘ‌జ్వ‌త్ అల్ హింద్ మాజీ అధ్యక్షుడు బుర్హాన్ కోకా సోద‌రుడ‌ని చెప్పారు. ఏప్రిల్ 29న షోపియాన్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఉగ్ర‌వాది బ‌ర్హాన్ కోకా మ‌ర‌ణించాడ‌న్నారు. దీనికి ప్ర‌తీకారంగా, ఆ సంస్థ ఆదేశాల‌తో న‌లుగురు యువ‌కులు ఢిల్లీలో పేలుళ్ల‌కు ప‌థ‌క ర‌చ‌న చేశార‌ని వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 27న ఢిల్లీకి వ‌చ్చార‌ని, అప్ప‌టినుంచి ప‌హ‌ర్‌గంజ్‌లో ఉంటున్నార‌ని తెల‌పారు. ఆయుధాలు, పేలుడు ప‌దార్థాలు సేక‌రించార‌ని డీసీపీ చెప్పారు. వీరిపై కఠిన శిక్షలు అమలు చేయనున్నట్లు తెలుస్తుంది.

Tags :
|

Advertisement