Advertisement

  • నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన హైద‌రాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది

నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన హైద‌రాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది

By: Sankar Wed, 19 Aug 2020 9:06 PM

నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన హైద‌రాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది


ఇటీవల వచ్చిన ఒక తెలుగు సినిమాలో నకిలీ సర్టిఫికెట్ల గురించి అద్భుతంగా చూయించారు..నకిలీ సర్టిఫికెట్స్ మాఫియా వలన ఎంత మంది ఇబ్బందులకు గురి అవుతున్నారో ఆ సినిమాలో చూయించారు..ఇప్పుడు తాజాగా ప‌దో త‌ర‌గ‌తి న‌కిలీ స‌ర్టిఫికెట్ల‌ను త‌యారు చేస్తున్న న‌లుగురు వ్య‌క్తుల‌ను హైద‌రాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వ‌ద్ద నుంచి న‌కిలీ ఎస్ఎస్‌సీ స‌ర్టిఫికెట్ల‌ను, ల్యాప్‌టాప్‌, ఇత‌ర డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌ను ఎం. మ‌హేంద‌ర్‌(46), ఎం. సంతోష్ రెడ్డి(31), ఏ. రాజేశ్ కుమార్‌(30), ఏ. జ‌యంత్ కుమార్‌(39)గా గుర్తించారు. నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ప‌దో త‌ర‌గ‌తి మార్కుల మెమోల‌ను వీరు త‌యారు చేస్తున్నారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని చెప్పి ఒక్కో వ్య‌క్తి వ‌ద్ద నుంచి రూ. 2 నుంచి రూ. 3 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూలు చేశారు. ఈ న‌కిలీ స‌ర్టిఫికెట్ల ద్వారానే ముగ్గురు వ్య‌క్తులు తాత్కాలికంగా ఉద్యోగానికి ఎంపికైన‌ట్లు డీసీపీ పి. రాధా కృష్ణారావు తెలిపారు. ఇంకొంత మంది డ‌బ్బులు చెల్లించిన‌ప్ప‌టికీ వారు ఎంపిక కాలేద‌న్నారు. వీరంతా పోలీసుల‌ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. త‌పాలాశాఖ అధికారుల‌ను సైతం అప్ర‌మ‌త్తం చేసిన‌ట్లు చెప్పారు.

Tags :
|
|
|

Advertisement