Advertisement

  • క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ వికెట్ కీపర్

క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ వికెట్ కీపర్

By: Sankar Wed, 09 Dec 2020 12:37 PM

క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ వికెట్ కీపర్


అతడు క్రికెట్ లోకి అరంగేట్రం చేసినప్పుడు అందరు అతడిని ఆశ్చర్యంగా చూసారు ...ఆస్ట్రేలియా గడ్డ మీద ప్రత్యర్థి బౌలర్లు అయిన బ్రెట్ లీ , వార్న్ , గిలెస్పీ వంటివారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పుడు ఆ ఆటగాడి టాలెంట్ కు అందరు ఫిదా అయ్యారు ..

టీమిండియా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నాణ్యమైన వికెట్ కీపర్ సమస్య ఇక తొలగిపోయినట్లే అని భావించారు...అయితే ఆ తర్వాత కాలంలో అంచనాలను అందుకోలేక జట్టులో స్థానం కోల్పోయాడు..ఇక ధోని వచ్చిన తర్వాత అందరు కీపర్లు లాగే తాను కూడా దేశవాళికే పరిమితం అయ్యాడు ...తాజాగా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపిన ఆ ఆటగాడు పార్థివ్ పటేల్...

35 ఏళ్ల పార్థివ్‌ టీమిండియా తరపున 25 టెస్టులు, 38 వన్డేలు, రెండు టీ20లు కలిపి 1706 పరుగులు.. 93 క్యాచ్‌లు, 19 స్టంపిం‍గ్స్‌ చేశాడు.ఇక దేశవాలి క్రికెట్‌లో గుజరాత్‌ తరపున 194 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు.ఇక పార్థివ్‌ తన చివరి టెస్టు మ్యాచ్‌ను 2018లో దక్షిణాఫ్రికాతో ఆడగా.. 2012లో ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడాడు. ఐపీఎల్‌లో పార్థివ్‌ పటేల్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌, డెక్కన్‌ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

Tags :
|

Advertisement