Advertisement

  • కేంద్ర మాజీ మంత్రి ఆర్జేడీ దిగ్గజ నేత రఘువంశ ప్రసాద్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి ఆర్జేడీ దిగ్గజ నేత రఘువంశ ప్రసాద్ కన్నుమూత

By: Sankar Sun, 13 Sept 2020 3:22 PM

కేంద్ర మాజీ మంత్రి ఆర్జేడీ దిగ్గజ నేత రఘువంశ ప్రసాద్ కన్నుమూత


కేంద్ర మాజీమంత్రి రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ (74) అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయనను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోవిడ్‌-19 నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయనకు వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స కొనసాగించారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే ఆర్జేడీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

రఘువంశ్ ప్రసాద్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీయే-1 ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూపకల్పన జరిగింది.

రఘువంశ్ ప్రసాద్ బీహార్‌లోని వైశాలి పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు. తొలిసారి 1996 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన విజయం సాధించిన రఘువంశ్ ప్రసాద్.. 2009 వరకు వరుసగా ఐదుసార్లు జయకేతనం ఎగురువేశారు.అయితే, 2014, 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. ఇటీవల కాలంలో ఆర్జేడీకి ఆయన దూరమవుతూ వచ్చారు. నాలుగు రోజుల కిందటే ఆ పార్టీకి రాజీనామా చేశారు. రఘువంశ్ రాజీనామాపై పునరాలోచించాలని, లేఖను ఉపసంహరించుకోవాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కోరారు

Tags :
|
|

Advertisement