Advertisement

  • ప్రపంచ కప్ ఫైనల్ ఫిక్స్ చేయడం అంత చిన్న విషయం కాదు ..జయవర్ధనే

ప్రపంచ కప్ ఫైనల్ ఫిక్స్ చేయడం అంత చిన్న విషయం కాదు ..జయవర్ధనే

By: Sankar Sun, 21 June 2020 11:12 AM

ప్రపంచ కప్ ఫైనల్ ఫిక్స్ చేయడం అంత చిన్న విషయం కాదు ..జయవర్ధనే



2011 ఈ సంవత్సరాన్ని ఏ భారత క్రికెట్ అభిమాని అంత త్వరగా మరిచిపోలేడు..క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చిరకాల వాంఛ అయినా ప్రపంచ కప్ ట్రోఫీని తన సొంత గడ్డ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సగర్వంగా ముద్దాడిన ఆక్షణాలు భారత క్రికెట్ చరిత్రలో ఎప్పుడు అలాగే పదిలంగా ఉంటాయి ..ఫైనల్లో శ్రీలంకతో తలపడిన భారత్ గంభీర్, ధోని , జహీర్ ఖాన్ లు రాణించడంతో శ్రీలంక మీద అద్భుత విజయాన్ని సాధించింది ..అయితే ఆదిలోనే సచిన్ సెహ్వాగ్ వికెట్లు కోల్పోయినప్పటికీ టీం ఇండియా పోరాడి గెలిచినా తీరు అద్బుతమనే చెప్పాలి ..చివర్లో ధోని కొట్టిన విన్నింగ్ సిక్సెర్ భారత క్రికెట్ ఉన్నంత కాలం ఉంటుంది అని సాక్షాత్తు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు అంటే ఆ మ్యాచ్ ఎంతలా ప్రభావం చూపించిందో తెలుస్తుంది .

అయితే ఆమ్యాచ్ మీద అప్పటి శ్రీలంక క్రీడా మంత్రి సంచలన వాఖ్యలు చేసిన విషయం తెల్సిందే ..ఆ మ్యాచ్ లో మేము గెలవాలి కాయాన్ని ఇండియాకు ఆ మ్యాచ్ను అమ్మేసారు అని సంచలన వ్యాఖ్యలు చేసాడు ..దీనిపై శ్రీలంక మాజీ దిగ్గజాలు అప్పటి టీంలో కీలక ఆటగాళ్లు సంగక్కర , జయవర్ధేనే కొట్టిపారేసిన విషయం తెలిసిందే..లంక మాజీ మంత్రి మహిదానంద అలుత్‌గమగే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. ఆరోపణల్లో తాను ఏ క్రికెటర్‌ గురించీ ప్రత్యేకంగా ప్రస్తావించలేదని... కుమార సంగక్కర, మహేల జయవర్ధనే ఎందుకు అతిగా స్పందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

సర్కస్‌ మొదలైందని మహేల చెబుతున్నాడు. ఈ విషయంలో వారిద్దరు ఎందుకు ఇంత అతిగా స్పందిస్తున్నారో నాకర్థం కావడం లేదు. పైగా నేను ఏ ఆటగాడి పేరు తీసుకోలేదు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ గురించి గతంలోనూ అర్జున రణతుంగ కూడా బహిరంగంగానే మాట్లాడారు. ఇదేమీ మొదటిసారి కాదు’ అని మహిదానంద వ్యాఖ్యానించారు. మరోవైపు తాజా వివాదంపై జయవర్ధనే మళ్లీ స్పందించాడు. ‘ప్రపంచకప్‌ ఫైనల్‌ను ఫిక్స్‌ చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. మ్యాచ్‌ ఆడిన తుది జట్టులో భాగం కాని వ్యక్తి అలా ఎలా చేయగలడో మాకైతే తెలీదు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా మాకు జ్ఞానోదయం కలిగించండి’ అంటూ మాజీ కెప్టెన్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఈ ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం విచారణ చేపడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.


Tags :
|
|

Advertisement