Advertisement

  • అతడిలో విశేషమైన టాలెంట్ ఉంది ...పాఠాలు నేర్చుకోవాలి ...హర్భజన్ సింగ్

అతడిలో విశేషమైన టాలెంట్ ఉంది ...పాఠాలు నేర్చుకోవాలి ...హర్భజన్ సింగ్

By: Sankar Thu, 10 Dec 2020 2:09 PM

అతడిలో విశేషమైన టాలెంట్ ఉంది ...పాఠాలు నేర్చుకోవాలి ...హర్భజన్ సింగ్


ప్రస్తుతం టీంఇండియాలో యువ ఆటగాళ్లు అద్భుత ప్రతిభతో దూసుకువస్తున్నారు..వారిలో ముందు వరుసలో ఉండే ఆటగాడు సంజు సాంసన్ ..ఈ ఏడాది జరిగిన ఐపీయల్ లో కొన్ని మ్యాచ్ లలో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టి ట్వంటీల సిరీస్ లో చోటు దక్కించుకున్నాడు....అయితే మూడు మ్యాచ్ లలో బ్యాటింగ్ చేసినప్పటికీ అంతగా ఆకట్టుకునే ప్రదర్శనలను చేయలేకపోయాడు ..దీనితో శాంసన్ కు హర్భజన్ సింగ్ విలువైన సలహాలు ఇచ్చాడు...

ప్రతీ ఒక్కరు తప్పులు చేస్తారని, అప్పుడే నేర్చుకునే అవకాశం దక్కుతుందని భజ్జీ తెలిపాడు. ఇది శామ్సన్‌ ఎక్కువగా విదేశీ పర్యటనల్లో ఆడిన సందర్భాలు లేవని, కానీ అతనిలో విపరీతమైన టాలెంట్‌ మాత్రం ఉందన్నాడు. ఈ తరహా క్రికెటర్లే టీమిండియా ఆశాకిరణాలను భజ్జీ పేర్కొన్నాడు.

ఒకవేళ చేసిన తప్పిదాల నుంచి మాత్రం శామ్సన్‌ పాఠాలు నేర్చుకుని గాడిలో పడకపోతే అతని టాలెంట్‌ వృథా అవుతుందన్నాడు. అదే సమయంలో శామ్సన్‌ ప్లేస్‌కు ఉండదనే విషయం గ్రహించాలన్నాడు. ఇప్పుడు శామ్సన్‌ చేయాల్సిందల్లా ఎందుకు విఫలం అయ్యాననే దానిపైనే ప్రధానంగా దృష్టి సారించాలన్నాడు.

Tags :

Advertisement