Advertisement

  • ఇంకా విషమంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ..దయచేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు అని కోరిన కుటుంబ సభ్యులు

ఇంకా విషమంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ..దయచేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు అని కోరిన కుటుంబ సభ్యులు

By: Sankar Thu, 13 Aug 2020 8:59 PM

ఇంకా విషమంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ..దయచేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు అని కోరిన కుటుంబ సభ్యులు



ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఏమాత్రం పురోగతి లేదని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని గురువారం (ఆగస్టు 13) విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. వెంటిలేటర్‌ సపోర్టుపై ఉంచి చికిత్స కొనసాగిస్తున్నామని తెలిపారు.

అయితే.. ఆయన శరీర అవయవాలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని.. గుండె నుంచి శరీర భాగాలకు రక్త సరఫరా సాధారణంగానే ఉందని వివరించారు. ఈ కారణంగానే ఆయన కోలుకొని మామూలు స్థితికి చేరుకుంటారనే కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ఆశలు సజీవంగా ఉన్నాయి.

మరోవైపు.. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. అలాంటి వార్తలను నమ్మొద్దని ప్రణబ్ కుమార్తె షర్మిష్టా ముఖర్జీ స్పష్టం చేశారు. ఆ వదంతులను చూసి.. తమకు అనేక మంది కాల్ చేస్తున్నారని, ఆ కాల్స్ నుంచి ప్రశాతంగా ఉండాలని కోరుకుంటున్నానని ట్విటర్ ద్వారా వెల్లడించారు.

Tags :
|

Advertisement