Advertisement

  • ఓపెనర్‌ 'పృథ్వీ షా' బాటింగ్ పై స్పందించిన మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌

ఓపెనర్‌ 'పృథ్వీ షా' బాటింగ్ పై స్పందించిన మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌

By: chandrasekar Sat, 19 Dec 2020 11:30 AM

ఓపెనర్‌ 'పృథ్వీ షా' బాటింగ్ పై స్పందించిన మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌


భారత్ ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్ల్లో కొత్తగా అవకాశం పొందిన యువ ఓపెనర్ పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్ లోను ఘోరంగా విఫలం కావడంతో అతని బాటింగ్ తీరుపై ఎడమచేతి వాటం పేసర్ జహీర్ ఖాన్ స్పందించారు. రెండు ఇన్నింగ్స్‌లోనూ ఒకే విధంగా తక్కువ బాల్ లకే బౌల్డ్‌ కావడంతో క్రికెట్ అభిమానుల మధ్య 'షా' తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు.

అతను మొదటి ఇనింగ్స్ లో డక్ అవుట్ గాను ఇక రెండో ఇనింగ్స్ లో నాలుగు పరుగులకే అవుట్ కావడంతో అభిమానులను నిరాశక గురిచేశాడు. ఇందువల్ల పేలవ ప్రదర్శన చేస్తున్న షా ఆస్ట్రేలియాతో మిగతా టెస్టులకు భారత జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమేనని మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు బంతులే ఆడిన పృథ్వీ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో నాలుగో బంతులకే పెవిలియన్‌ చేరాడు. కనీసం ఎక్కువ బంతులాడి నిలదొక్కుకోలేక పోయాడు.

Tags :

Advertisement