Advertisement

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పై లైంగిక ఆరోపణలు

By: Sankar Fri, 18 Sept 2020 09:56 AM

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పై లైంగిక ఆరోపణలు


అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై మరోసారి లైంగిక ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ట్రంప్ 1997 లో తనను లైంగికంగా వేధించారని మాజీ మోడల్ ఒకరు ఆరోపించారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న ట్రంప్ తిరిగి బరిలో నిలిచిన అధ్యక్ష ఎన్నికలకు కొన్ని వారాల ముందు తాజాగా ఆరోపణలు వచ్చాయి.

న్యూయార్క్‌లో జరిగిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ జరుగుతుండగా ట్రంప్ తన వీఐపీ సూట్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మాజీ మోడల్ అమీ డోరిస్ చెప్పారు. "అతడు నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని చూశాడు. తన నాలుకను నా గొంతు క్రిందకు కదిలించే ప్రయత్నం చేయగా నేను అతనిని నెట్టివేశాను. ఆపై అతడి పట్టు గట్టిగా మారింది. అతడు తన చేతులతో నా శరీరంపై ఎక్కడెక్కడో ముట్టుకున్నాడు.

నేను ఆయన పట్టులో ఉండిపోయి బయటపడలేకపోయాను" అని డోరిస్ ఒక పత్రికకు ఇచ్చని ఇంటర్వ్యూలో వెల్లడించింది. మరోవైపు ఈ ఆరోపణలపై ట్రంప్ న్యాయవాదులు స్పందించారు. రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణల తప్ప మరొకటి కాదని కొట్టి పారేశారు.

Tags :

Advertisement