Advertisement

  • ఢిల్లీలోని మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే మహేందర్‌ మరణం

ఢిల్లీలోని మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే మహేందర్‌ మరణం

By: chandrasekar Mon, 06 July 2020 10:24 AM

ఢిల్లీలోని మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే మహేందర్‌ మరణం


1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే మహేందర్‌ యాదవ్‌ (70)కరోనా బారినపడి చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఓ ప్రైవేటు దవాఖానలో ఆదివారం మృతి చెందినట్లు ఢిల్లీ జైళ్లశాఖ డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ గోయల్‌ తెలిపారు. ఢిల్లీలోని పాలమ్‌ నియోజకవర్గం నుంచి యాదవ్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో 10 ఏండ్ల శిక్షపడడంతో మండోలి జైలులోని 14వ నెంబర్‌ బ్యారక్‌లో ఉంటున్నాడు.ఇదే బ్యారక్‌లో ఉంటున్న ఓ ఖైదీ జూన్‌ 15న మృతి చెందడంతో శవపరీక్ష నిర్వహించగా కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ బ్యారక్‌లో ఉంటున్న 29మంది వృద్ధ ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్‌ వచ్చింది.

ఐదు రోజుల అనంతరం మరో ముగ్గురికి పరీక్షలు నిర్వహించగా యాదవ్‌తోపాటు మిగిలిన ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. యాదవ్‌ హృదయ సంబంధ వ్యాధి లక్షణాలతో తీవ్ర ఇబ్బంది పడుతుండడంతో డీడీయూ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఎల్‌ఎన్‌జేపీ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ద్వారకలోని ఆకాశ్‌ హెల్త్‌కేర్‌ హాస్పటల్‌కు తరలించగా అక్కడ మృతి చెందాడు.

Tags :
|
|

Advertisement