Advertisement

  • మోకా భాస్కరావు హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ తిరస్కృతి

మోకా భాస్కరావు హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ తిరస్కృతి

By: chandrasekar Fri, 31 July 2020 09:13 AM

మోకా భాస్కరావు హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ తిరస్కృతి


మోకా భాస్కరావు హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కోర్టు బెయిల్ తిరస్కరించింది. మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కృష్ణా జిల్లా కోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

మచిలీపట్నానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత మోకా భాస్కరావు హత్యకేసులో కొల్లు రవీంద్ర ఏ4గా ఉన్నారు. కొల్లు బయటికి వస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) వాదనతో జిల్లా కోర్టు జడ్జి ఏకీభవించారు. అతనికి బెయిల్‌ ఇవ్వరాదని తేల్చి చెప్పారు.

కొల్లు రవీంద్రతో పాటు మిగతా నిందితులకు కూడా బెయిల్‌ను కూడా కోర్టు నిరాకరించింది. గత నెల 29న మచిలీపట్నం చేపల మార్కెట్‌ దగ్గర వైఎస్సార్‌సీపీ నేత మోకా భాస్కరరావును దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో చింతా నాంచారయ్య (చిన్ని), చింతా నాంచారయ్య (పులి), చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీకృష్ణ, పోల రాము, ధనలతో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్‌ చేశారు.

ఈ కేసులో కుట్ర దారుడిగా పేర్కొంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఏ–4 నిందితుడిగా అరెస్ట్‌ చేశారు. ఆయన నిందితులకు సహకరించారనే అభియోగాలు ఉన్నాయి. ఆయన్ను తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

Tags :
|

Advertisement