Advertisement

  • పచ్చి చేపను కొరికితిన్న మాజీ మంత్రి...వీడియో వైరల్...

పచ్చి చేపను కొరికితిన్న మాజీ మంత్రి...వీడియో వైరల్...

By: chandrasekar Fri, 20 Nov 2020 6:26 PM

పచ్చి చేపను కొరికితిన్న మాజీ మంత్రి...వీడియో వైరల్...


కరోనా వైరస్ పుణ్యమా అని సోషల్ మీడియాలో ఎన్నో అపోహలు, అసత్య వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తలు నిజమా? కాదా? అనే నిర్థారణ చేసుకోకుండానే ప్రజలు నమ్ముతున్నారు. ఇటీవల సీఫుడ్ వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందనే వదంతులు వచ్చాయి. శ్రీలంకలోని కొలంలో శివార్లలో ఉన్న సెంట్రల్ ఫిష్ మార్కెట్లో కరోనా కేసుల సంఖ్య పెరుగడంతో ఈ వదంతులు మరింతగా వ్యాపించాయి. ఫలితంగా శ్రీలంకలో చేపల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. అందుకే శ్రీలంకలోని చాలా ఏరియాల్లో ప్రజలు సీఫుడ్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వదంతులకు పుల్స్టాప్ పెట్టడానికి, ప్రజల్లో నమ్మకం కలిగించి సీఫుడ్ అమ్మకాలను ప్రోత్సహించడానికి శ్రీలంకలోని ఓ మాజీ మంత్రి చొరవ తీసుకున్నారు. ఏకంగా మీడియా ముందు పచ్చి చేపను నమిలి తినేశారు శ్రీలంక మాజీ మంత్రి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నేను మీ ముందే చేపను తింటున్నాను.. కరోనా రాదు.. ఏం రాదు.. అన్నీ పుకార్లే అని చెప్పారు. మీరు కూడా చేపలు తినాలని జనాలకు సూచించారు. శ్రీలంకకు చెందిన 63 ఏళ్ల దిలీప్ వెదారాచ్చి 2019 వరకు మత్య్స శాఖ మంత్రిగా పనిచేశారు. చేపలు తింటే కరోనా వస్తుందన్న పుకార్లు సోషల్ మీడియాలో విస్తృతం కావడంతో ఈ పుకార్లకు పుల్స్టాప్ పెట్టడానికి ఆయనే స్వయంగా చొరవ తీసుకున్నారు.

కొలంబోలో మీడియా సమావేశంలో సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ ‘‘ సీఫుడ్ తినడం ద్వారా కరోనా మహమ్మారి వ్యాపిస్తుందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీని వల్ల ప్రజలు సీఫుడ్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ తప్పుడు ప్రచారం వల్ల జాలర్లకు ఉపాధి కరువవుతోంది. వాస్తవానికి, సీఫుడ్ వల్ల ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఉండదు. ప్రజలకు చూపించడానికే నేను ఈ చేపను తీసుకువచ్చాను. ఈ చేపను ఎటువంటి భయం లేకుండా తినమని నేను దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని తినడం వల్ల మీరు కరోనావైరస్ బారిన పడరు." అని ఆయన అన్నారు. దీన్ని నిరూపించేందుకు తానే స్వయంగా చొరవ తీసుకోని మీడియా ముందే పచ్చి చేపను నోటితో కొరికి తిన్నారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. శ్రీలంక ప్రధాన ఆదాయ వనరుల్లో చేపల పరిశ్రమది ముఖ్య పాత్ర. కొలంబోలోని చేపల మార్కెట్లో కరోనావైరస్ వ్యాప్తి విస్తృతం కావడంతో ఇటీవల మార్కెట్‌ను మూసివేశారు. ప్రజలు చేపలు కొనడం, తినడం మానేయడంతో ధరలు అమాంతం పడిపోయాయి. ప్రస్తుతం శ్రీలంకలో 18 వేల కరోనా కేసులు ఉన్నాయి

Tags :
|
|

Advertisement