Advertisement

  • అవినీతి కేసులో మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ కు 12 సంవత్సరాలు జైలు శిక్ష

అవినీతి కేసులో మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ కు 12 సంవత్సరాలు జైలు శిక్ష

By: chandrasekar Wed, 29 July 2020 8:08 PM

అవినీతి కేసులో మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ కు 12 సంవత్సరాలు జైలు శిక్ష


మలేషియాలో చట్టం చాలా కఠినంగా ఉంటుంది. కీలకమైన వ్యక్తుల్ని కూడా వదిలిపెట్టారు. అవినీతి కేసులో ఆ దేశ మాజీ ప్రధానికి అక్కడి కోర్టు 12 ఏళ్ల జైలుశిక్ష విధించడం సంచలనంగా మారింది. భారీ అవినీతి పాల్పడిన ప్రధానిని దోషిగా నిర్ధారించారు. మలేషియాలో లా అండ్ ఆర్డర్ కఠినంగా ఉంటుంది. అవినీతి ఆరోపణలపై మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ దోషిగా తేల్చింది అక్కడి న్యాయస్థానం. ఏకంగా 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

మలేషియా డవలప్ మెంట్ బెర్హాద్ ( వన్ ఎండిబీ ) ఫండ్ కేసులో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై కేసు నడిచింది. 2009 నుంచి 2018 వరకూ నజీబ్ మలేషియా ప్రధానిగా పని చేశారు. అవినీతి బయటపడటంతోనే ఆయన పదవి కోల్పోయారు. మలేషియాలో ఓ మాజీ ప్రధానిని దోషిగా నిర్ధారించడం ఇదే తొలిసారి. ఆయనపై అధికార దుర్వినియోగం, మనీ లాండరింగ్, నమ్మకం ద్రోహం కేసులున్నాయి.

మాజీ ప్రధాని మలేషియా ఎన్ ఆర్ సీ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి 9.8 మిలియన్ తన ఖాతాకు మళ్లించుకున్నారన్న ఆరోపణలున్నాయి. అదే విధంగా 4-5 బిలియన్ డాలర్లను వ్యక్తిగత ఖాతాకు మళ్లించారన్న అభియోగముంది. ఈ అన్ని ఆరోపణలు రుజువు కావడంతో కౌలాలంపూర్ కోర్టు ఏకకాలంలో మూడు శిక్షలు అమలయ్యేలా 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Tags :
|

Advertisement