Advertisement

  • త్వరలో తండ్రి అవుతున్నట్లు ప్రకటించిన భారత దిగ్గజ ఆటగాడు

త్వరలో తండ్రి అవుతున్నట్లు ప్రకటించిన భారత దిగ్గజ ఆటగాడు

By: Sankar Tue, 13 Oct 2020 2:22 PM

త్వరలో తండ్రి అవుతున్నట్లు ప్రకటించిన భారత దిగ్గజ ఆటగాడు


భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను త్వరలో తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు జహీర్. తన ట్విట్టర్ లో ''మా ఇంట్లోకి త్వరలో మూడో మనిషి రాబోతున్నాడు'' అని జహీర్ పోస్ట్ చేసాడు.

అయితే జహీర్ బాలీవుడ్ నటి సాగరికా ఘాట్గే ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. జహీర్ - సాగరిక జంట ఏప్రిల్ 2017 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదవ సీజన్లో ఈ జంట తమ నిశ్చితార్థాన్ని ప్రకటించారు. తరువాత జహీర్ 23 నవంబర్ 2017 న వివాహం చేసుకున్నారు.

సాగరికా షారుఖ్ ఖాన్ నటించిన 'చెక్ దే ఇండియా' సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. ఇక జహీర్-సాగరికా ప్రస్తుతం యూఏఈ లో ఉన్నారు. కరోనా కారణంగా ఐపీఎల్ 2020 యూఏఈ లో జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే జహీర్ ముంబై ఇండియన్స్ జట్టుకి క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Tags :
|

Advertisement