Advertisement

  • భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డీప్ కోమాలోకి

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డీప్ కోమాలోకి

By: chandrasekar Wed, 26 Aug 2020 5:39 PM

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డీప్ కోమాలోకి


భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ డీప్ కోమాలోకి వెళ్లినట్లు డాక్టర్లు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైందని మొన్ననే అయన కొడుకు అభిజిత్ ముఖర్జీ తెలిపారు. కానీ ఇప్పుడు ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి డాక్టర్లు మరోరకమైన విషయం చెప్పారు. ప్రణబ్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ట్రీట్‌మెంట్ పొందుతున్నారన్న డాక్టర్లు అయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందన్నట్లు మరియు నిన్నటి నుంచి ప్రధాన అవయవాల స్పందన స్వల్పంగా తగ్గిందని చెప్పారు.

ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమించడంతో ప్రస్తుతం డీప్ కోమాలో ఉన్నారనీ వెంటిలేటర్ సపోర్టుతో ఉన్నారని డాక్టర్లు తాజా బులిటెన్ ద్వారా వివరించారు. డీప్ కోమాలోకి వెళ్లిపోవడంతో ప్రణబ్ మెడికల్ కండీషన్‌ను అంచనా వెయ్యడం డాక్టర్లకు కష్టమవుతోంది. ప్రణబ్ ముఖర్జీ రెండు వారాలుగా ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్ ముఖర్జీకి క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. చికిత్స తరవాత కూడా ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. దానికి తోడు ఆయనకు కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది.

ప్రణబ్ ముఖర్జీ తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆస్పత్రిలో చేరినప్పుడు ట్విటర్ వేదికగా వెల్లడించారు. తాను వేరే కారణాల వల్ల ఆస్పత్రికి వెళితే తనకు కరోనా పాజిటివ్ అనే విషయం నిర్థారణ అయ్యిందని తెలిపారు. తనను కలిసిన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ పాటించి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రణబ్ ముఖర్జీకి రకరకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయన్ని దగ్గరుండి చూసుకుంటోందని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా నేతలు, ప్రముఖులు కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు రోజూ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తున్నారు. తద్వారా ప్రణబ్ ఆరోగ్యం ఎలా ఉందో దేశ ప్రజలకు తెలుపుతున్నారు. వయసు అధికంగా ఉండడంతో అనారోగ్యం నుండి కోలుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు.

Tags :
|

Advertisement