Advertisement

  • నేను ఇచ్చిన ఆ ఒక్క సలహాతో కోహ్లీ తన ఆటతీరును పూర్తిగా మార్చుకున్నాడు ..గ్యారీ కిర్‌స్టన్

నేను ఇచ్చిన ఆ ఒక్క సలహాతో కోహ్లీ తన ఆటతీరును పూర్తిగా మార్చుకున్నాడు ..గ్యారీ కిర్‌స్టన్

By: Sankar Tue, 14 July 2020 4:36 PM

నేను ఇచ్చిన ఆ ఒక్క సలహాతో కోహ్లీ తన ఆటతీరును పూర్తిగా మార్చుకున్నాడు ..గ్యారీ  కిర్‌స్టన్



విరాట్ కోహ్లీ ..ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లోనే గాక ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ ఆటగాడు ..సెంచరీల మీద సెంచరీలు చేస్తూ తనకు మాత్రమే సాధ్యం అయినా టైమింగ్ తో చెలరేగిపోతున్నాడు ..అయితే టీంలోకి వచ్చిన కొత్తలో కోహ్లీ కొన్ని మ్యాచ్ ల వరకు అంతగా రాణించలేదు ..దాంతో.. షాట్ సెలక్షన్‌పై కోహ్లీకీ ఫస్ట్ మీటింగ్‌లోనే తాను ఒక్క సూచన చేసినట్లు వెల్లడించిన గ్యారీ కిర్‌స్టన్.. ఆ తర్వాత మ్యాచ్‌లోనే అతను తన అంతర్జాతీయ కెరీర్‌లో ఫస్ట్ సెంచరీ నమోదు చేసినట్లు వెల్లడించాడు.

విరాట్ కోహ్లీ గురించి తాజాగా యూట్యూబ్ ఛానల్‌తో గ్యారీ కిర్‌స్టన్ మాట్లాడుతూ ‘‘విరాట్ కోహ్లీని తొలిసారి కలిసినప్పుడు.. ఈ కుర్రాడిలో చాలా ప్రతిభ దాగుందని నాకు అర్థమైంది. కానీ.. సరైన మార్గంలో దాన్ని వినియోగించుకోవడం లేదని నేను గుర్తించా. దాంతో.. శ్రీలంకతో వన్డే సిరీస్‌ సమయంలో మా మధ్య చాలా చర్చలు జరిగాయి. ఫస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నట్లు కనిపించాడు.

కానీ.. 30 పరుగులు స్కోరు వద్ద బౌలర్ తలమీదుగా సిక్స్ కొట్టబోయి లాంగాన్‌లో ఫీల్డర్‌కి దొరికిపోయాడు. దాంతో.. నేను కోహ్లీకి ఒక్కటే చెప్పా. ‘నువ్వు నీ ఆటని మరో స్థాయికి తీసుకెళ్లాలంటే.. బంతిని గాల్లోకి లేపకూడదు. గ్రౌండ్‌ వెలుపలికి బంతిని తరలించే సామర్థ్యం నీలో ఉంది. కానీ.. ఆ షాట్‌ రిస్క్‌తో కూడుకున్నది’ అని చెప్పా. దాంతో.. తర్వాత మ్యాచ్‌లో తన ఆటతీరు మార్చుకున్న కోహ్లీ సెంచరీ బాదేశాడు. అదే అతని ఫస్ట్ ఇంటర్నేషనల్ సెంచరీ’’ అని గ్యారీ కిర్‌స్టన్ వెల్లడించాడు.

Tags :
|
|
|
|

Advertisement