Advertisement

  • బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మృతి చెందిన ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ డేవిడ్ క్యాపెల్

బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మృతి చెందిన ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ డేవిడ్ క్యాపెల్

By: chandrasekar Thu, 03 Sept 2020 09:35 AM

బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మృతి చెందిన ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ డేవిడ్ క్యాపెల్


బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ డేవిడ్ క్యాపెల్ మృతి చెందారు. ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ డేవిడ్ క్యాపెల్ అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రస్తుతం డేవిడ్ వయస్సు 57 ఏళ్లు. 1987-1990 మధ్య ఇంగ్లాండ్ తరపున 15 టెస్టులు, 23 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన డేవిడ్ రిటైర్మెంట్ అనంతరం కోచ్‌గా ఎంతో మంది క్రికెటర్స్‌కి శిక్షణ ఇచ్చాడు.

నార్తంప్టన్‌షైర్‌కి చెందిన డేవిడ్ 2018లో బ్రెయిన్ ట్యూమర్ బారినపడ్డాడు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న డేవిడ్ బుధవారం తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. డేవిడ్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆయన మృతి ఇంగ్లాండ్ క్రికెట్‌కి తీరని లోటు అని ఆవేదన వ్యక్తంచేసింది. డేవిడ్ క్యాపెల్ ఇటు బాటింగ్ లోను అటు బౌలింగ్ లోను అందరిని ఆకట్టుకున్నాడు.

అల్ రౌండర్ గా ప్రతిభ కనబరచడం వల్ల లోయర్ ఆర్డర్ లో తాను ఆడాల్సి ఉండేది.1981-1998 మధ్య నార్తంప్టన్‌షైర్‌ జట్టు తరపున 270 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు ఆడిన డేవిడ్ ఖాతాలో మరో అరుదైన ఘనత కూడా ఉంది. 1987 జులైలో కరాచిలో పాకిస్తాన్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా డేవిడ్ టెస్టుల్లోకి ఆరంగేట్రం చేశాడు. అలా నార్తంప్టన్‌షైర్ కౌంటి నుంచి అప్పటికి ముందు గత 77 ఏళ్లలో ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్‌లో చోటు సంపాదించుకున్న ఏకైక క్రికెటర్‌గా డేవిడ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. చాలా మంది అతని అభిమానులు అతని మృతికి సంతాపం తెలిపారు.

Tags :
|

Advertisement