Advertisement

  • ఎంత టాలెంట్ ఉన్న ఏమి ప్రయోజనం ఇలా ఆడితే ...శాంసన్ మీద అసహనం వ్యక్తం చేసిన వేణు గోపాల్రావు

ఎంత టాలెంట్ ఉన్న ఏమి ప్రయోజనం ఇలా ఆడితే ...శాంసన్ మీద అసహనం వ్యక్తం చేసిన వేణు గోపాల్రావు

By: Sankar Thu, 22 Oct 2020 6:59 PM

ఎంత టాలెంట్ ఉన్న ఏమి ప్రయోజనం ఇలా ఆడితే ...శాంసన్ మీద అసహనం వ్యక్తం చేసిన వేణు గోపాల్రావు


ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ యువ ఆటగాళ్లలో బాగా వినిపిస్తున్న పేర్లలో ఒకరి సంజు శాంసన్ ..ఎంతో టాలెంట్ ఉన్న ఆటగాడిగా ప్రశంసలు అందుకున్న శాంసన్ ,ఆటతీరులో నిలకడ లేకపోవడంతో ఇండియన్ టీంలో సరిగా అవకాశాలు సంపాదించుకోలేకపోతున్నాడు..

అయితే ఈ ఐపీయల్ లో వరుసగా విఫలం అవుతున్న ఈ రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ సంజూశాంసన్ ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్, తెలుగు కామెంటేటర్ వేణుగోపాల్ రావు అసహనం వ్యక్తం చేశాడు. ఎంతో ప్రతిభ కలిగిన శాంసన్ అనవసర తప్పిదాలతో వరుసగా విఫలమవుతున్నాడని అభిప్రాయపడ్డాడు. ఎంత సేపు భారీ షాట్లు ఆడుతూ మూల్యం చెల్లించుకుంటున్నాడని, టీ20 క్రికెట్ అంటే ఎంతసేపు ఫోర్లు, సిక్స్‌లే కాదని చురకలంటించాడు. చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లతో గెలిచి ప్లే ఆశలను నిలుపుకున్న విషయం తెలిసిందే.

గత ఏడు మ్యాచ్‌లుగా శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. వికెట్ పడిన మరుసటి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటైన పరిస్థితులు ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యంగా ఆడితే ఏంత ప్రతిభ ఉన్నా పక్కన పెట్టేస్తారు.'అని వేణుగోపాల్ రావు సూచించాడు. ఈ సీజన్ ప్రారంభంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన శాంసన్.. తర్వాత దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్‌లో శాంసన్‌కు ఇది కొత్త కాదు. గత రెండు సీజన్లలో కూడా ఈ కేరళ బ్యాట్స్‌మెన్ ఇలాంటి ప్రదర్శననే కనబర్చాడు.

Tags :

Advertisement