Advertisement

  • కేదార్ జాదవ్ లో స్పార్క్ కనిపించిందా ..ధోని మీద ఫైర్ అయిన మాజీ ఆటగాడు శ్రీకాంత్

కేదార్ జాదవ్ లో స్పార్క్ కనిపించిందా ..ధోని మీద ఫైర్ అయిన మాజీ ఆటగాడు శ్రీకాంత్

By: Sankar Tue, 20 Oct 2020 5:24 PM

కేదార్ జాదవ్ లో స్పార్క్ కనిపించిందా ..ధోని మీద ఫైర్ అయిన మాజీ ఆటగాడు శ్రీకాంత్


చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఐపీయల్ లో వరుస ఓటములు చవిచూస్తుండటం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు..ఎప్పుడు పాయింట్ల పట్టికలో టాప్ లో ఉండే చెన్నై ఈ సరి అనూహ్యంగా చివరి స్థానంలో ఉంది ఏదయినా అద్భుతం జరిగితే తప్ప చెన్నై ఈ సరి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టడం ఖాయం..

అయితే చెన్నై ఓటముల కన్నా ఓడిపోయే విధానమే ఎక్కువగా బాధిస్తుంది..దిగ్గజ జట్టు అయిన చెన్నై చాల సాధారణంగా మ్యాచ్ లను ప్రత్యర్థి జట్లకు ఇచ్చేస్తుంది..టీం సెలక్షన్ కూడా ఈ సారి చెన్నై ని బాగా దెబ్బతీసింది..యువ ఆటగాళ్లలో మెరుపు (స్పార్క్) కనిపించనందునే.. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో వారికి అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. ఒత్తిడి తక్కువగా ఉన్నప్పుడు యువ ఆటగాళ్లు బాగా రాణిస్తారని మహీ చెప్పుకొచ్చాడు.

ధోనీ వ్యాఖ్యల పట్ల శ్రీకాంత్ మండిపడ్డారు. స్టార్ స్పోర్ట్స్ తమిళ్‌తో మాట్లాడిన శ్రీకాంత్.. ‘‘ధోనీ గొప్ప ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రాసెస్‌ను నమ్ముతానని ధోనీ చెబుతున్న మాటలను నేను అంగీకరించను. ధోనీ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ టీమ్ సెలక్షన్ విధానమే తప్పు’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు.

జగదీషన్ లాంటి యువ ఆటగాళ్లలో స్పార్క్ లేదని నువ్వు చెబుతున్నావ్. మరి కేదార్ జాదవ్‌లో స్పార్క్ ఉందా..? పియూష్ చావ్లాలో స్పార్క్ చూపించాడా..? ధోనీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ధోనీ ఇవాళ మాట్లాడినదాన్ని నేను అంగీకరించను. ఇలా చేసే చెన్నై టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి తలెత్తింది అని శ్రీకాంత్ వాపోయారు.
ధోనీ గొప్ప క్రికెటర్ అనడంలో ఎలాంటి అనుమానాల్లేవ్. కానీ బంతి గ్రిప్ దొరకడం లేదన్న ధోనీ వ్యాఖ్యలను నేను సమర్థించను’’ అని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

Tags :
|

Advertisement