Advertisement

  • నిర్బంధం నుంచి విముక్తి ఐన మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ

నిర్బంధం నుంచి విముక్తి ఐన మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ

By: chandrasekar Wed, 14 Oct 2020 10:07 AM

నిర్బంధం నుంచి విముక్తి ఐన  మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ


న్యూఢిల్లీ: పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ ఆర్టికల్ 370 రద్దుకు ముందు గతేడాది ఆగస్టు 4న ప్రారంభమైన నిర్బంధం మంగళవారం ముగిసింది. మెహబూబా ముఫ్తీ నిర్బంధం నుంచి మంగళవారం రాత్రి విడుదలయ్యారు. ఈ మేరకు ఈ విషయాన్ని ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపారు. అంతేకాకుండా మెహబూబా ముఫ్తీని నిర్బంధం నుంచి విడుదల చేస్తున్నట్టు జమ్ముకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి రోహిత్ కన్సల్ మంగళవారం రాత్రి ప్రకటించారు. అయితే.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న పార్లమెంటులో బిల్లులను ప్రవేశబెట్టింది. ఈ క్రమంలో ఒకరోజు ముందు ఆగస్టు 4న మాజీ సీఎం మహబూబా ముఫ్తీతోపాటు, అగ్రనేతలు ఫరుక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాతోపాటు అనేక మంది కాశ్మీర్ నాయకులను అదుపులోకి తీసుకోని నిర్భంధించిన విషయం తెలిసిందే.

అప్పుడు కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదా ఆర్టికల్ 370 ను రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూకాశ్మీర్, లడఖ్‌లుగా విభజించింది. ఈ క్రమంలో మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, పలువురు కీలక నేతలను రెండుమూడు నెలల క్రితం ప్రభుత్వం విడుదల చేయగా మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని పలుమార్లు పొడిగించింది. మొదట 2019 ఆగస్టు 5న మెహబూబాను కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తరువాత 2020 ఫిబ్రవరి 6 న కఠినమైన ప్రజా భద్రతా చట్టం కింద కస్టడీని పొడిగించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 7న ఆమెను అధికారిక నివాసానికి తరలించి నిర్భంధంలో ఉంచారు. అనంతరం జూలై 31న ప్రభుత్వం ఆమె నిర్భంధ కాలన్ని మూడునెలలపాటు పొడిగించింది. అయితే ఇదే విషయంపై రెండు రోజుల్లో సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఆమెపై విధించిన డిటెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద ముఫ్తీ 436 రోజుల పాటు నిర్భంధంలో ఉన్నారు. అయితే.. మెహబూబా ముఫ్తీ విడుదల గురించి ఆమె ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆమె కూతురు ఇల్టిజా సమాచారమిచ్చారు. తన అక్రమ నిర్బంధం చివరకు ముగియనుందని ఈ కఠిన సమయాల్లో తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నానంటూ ఆమె కూతురు ఇల్టిజా ట్విట్ చేసింది.

Tags :
|

Advertisement