Advertisement

  • భారత రాజకీయాలలో మరొక విషాదం ..బీజేపీ దిగ్గజ నేత , మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్ కన్నుమూత

భారత రాజకీయాలలో మరొక విషాదం ..బీజేపీ దిగ్గజ నేత , మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్ కన్నుమూత

By: Sankar Sun, 27 Sept 2020 09:24 AM

భారత రాజకీయాలలో మరొక విషాదం ..బీజేపీ దిగ్గజ నేత , మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్ కన్నుమూత


కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ ఇవాళ ఉదయం కన్నుమూశారు.. ఆయన వయస్సు 82 ఏళ్లు.. 1938 జనవరి 3వ తేదీన జన్మించిన ఆయన.. ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. పార్లమెంటు సభ్యుడిగా అత్యధిక కాలం పనిచేసిన నేతగా ఆయనకు పేరుంది.. రాజ్యసభ, లోకసభలో ఆయన 1980 నుంచి 2014 వరకు కొనసాగారు. జస్వంత్ సింగ్ మరణాన్ని సోషల్ మీడియాలో వేదికగా తెలియజేస్తూ నివాళులర్పించారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్..

బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జస్వంత్ సింగ్ జీ కన్నుమూసినందుకు తీవ్ర బాధ కలిగింది. ఆయన దేశానికి సేవ చేవలు అందించారు.. సమర్థవంతమైన మంత్రి మరియు పార్లమెంటు సభ్యుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారంటూ రాజ్‌నాథ్‌ ట్వీట్ చేశారు. జస్వంత్ సింగ్ తన మేధో సామర్థ్యాలను, దేశ సంక్షేమం కోసం ఆయన పోషించిన పాత్రను దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని పేర్కొన్న ఆయన.. జస్వంత్ సింగ్ మేథో సామర్థ్యాలు మరియు సేవలను దేశం గుర్తుంచుకుంటుందన్నారు. రాజస్థాన్‌లో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా జస్వంత్ సింగ్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.. "జస్వంత్ సింగ్ జీ మన దేశానికి శ్రద్ధగా సేవ చేశారు, మొదట సైనికుడిగా, తర్వాత రాజకీయాలతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వ కాలంలో కీలకమైన పాత్ర పోషించారని గుర్తుచేసుకున్న మోడీ.. ఫైనాన్స్, డిఫెన్స్ రంగాల్లో మంచి సేవలు అందించారని కొనియాడారు. కాగా, జనవరి 3, 1938న జన్మించిన జస్వంత్ సింగ్.. భారత సైన్యంలోను పనిచేశారు.. రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు.. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఆయన ఒకరు.

Tags :
|

Advertisement