Advertisement

  • బ్రెజిల్ మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు రోనాల్దిన్హోను విడుదల...రూ.కోటిన్నర జరిమానా

బ్రెజిల్ మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు రోనాల్దిన్హోను విడుదల...రూ.కోటిన్నర జరిమానా

By: chandrasekar Wed, 26 Aug 2020 12:07 PM

బ్రెజిల్ మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు రోనాల్దిన్హోను విడుదల...రూ.కోటిన్నర జరిమానా


నకిలీ పాస్‌పోర్ట్ కేసులో పరాగ్వే కోర్టు కస్టడీలో గత ఐదు నెలలుగా ఉంటున్న బ్రెజిల్ మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు రోనాల్దిన్హోను విడుదలయ్యాడు. ఈ కేసులో రోనాల్దిన్హో సోదరుడు రాబర్టో డి అసిస్‌ను కూడా విడుదల చేయాలని జడ్జి గుస్తావో అమరిల్లా ఆదేశించారు. పరాగ్వే రాజధాని అసున్సియన్‌లోని పాల్మరోగా హోటల్‌లో గత ఐదు నెలలుగా ఇద్దరూ గృహ నిర్బంధంలో ఉన్నారు. ఈ ఇద్దరు సోదరులు రెండు లక్షల డాలర్లు (రూ.కోటిన్నర) జరిమానా విధించారు. ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్లడానికి రోనాల్దిన్హోకు స్వేచ్ఛ ఉన్నదని, అయితే వచ్చే ఏడాదిలోపు తన శాశ్వత చిరునామాను మార్చుకున్నపక్షంలో అట్టి విషయాన్ని కోర్టుకు తెలియజేయాలని న్యాయమూర్తి గుస్తావో ఆదేశించారు. పెనాల్టీ తప్ప ఎలాంటి పరిమితులు విధించలేదు.

బ్రెజిల్‌లోని న్యాయమూర్తి ఎదుట రోనాల్దిన్హో సోదరుడు మాత్రం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి హాజరుకావలసి ఉంటుంది. స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు రోనాల్దిన్హో తన సోదరుడితో కలిసి పరాగ్వే రాజధాని అసున్సియన్‌కు మార్చిలో పిల్లల ఛారిటీ ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చాడు. పోలీసులు వారు బస చేసిన హోటల్‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ నకిలీ పాస్‌పోర్టుల ద్వారా దేశంలోకి ప్రవేశించినట్లు ఆరోపణలు వచ్చాయి. రోనాల్దిన్హో తన ఫుట్‌బాల్ కెరీర్‌లో పారిస్ సెయింట్-జర్మైన్, బార్సిలోనా, మిలన్ వంటి క్లబ్‌ల కోసం ఆడాడు. అతను 2018 లో ఫుట్‌బాల్ నుంచి రిటైర్ అయ్యాడు.

Tags :
|
|

Advertisement