Advertisement

  • శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ పదవిని వదిలేయడం భారత క్రికెట్ కు శుభ పరిమాణం.... ఎన్‌.శ్రీనివాసన్

శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ పదవిని వదిలేయడం భారత క్రికెట్ కు శుభ పరిమాణం.... ఎన్‌.శ్రీనివాసన్

By: Sankar Fri, 03 July 2020 11:25 AM

శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ పదవిని వదిలేయడం భారత క్రికెట్ కు శుభ పరిమాణం....  ఎన్‌.శ్రీనివాసన్



ఐసీసీ చైర్మన్‌ పదవి నుంచి శశాంక్‌ మనోహర్‌ వైదొలగడం భారత క్రికెట్‌కు శుభపరిణామమని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌ వ్యాఖ్యానించాడు. తన పదవీకాలం ముగిసిన నేపథ్యంలో మనోహర్‌ బుధవారం చైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. దీంతో ఐసీసీలో అతడి ఉనికి లేకపోవడంతో బీసీసీఐ వర్గాలు హర్షిస్తాయని శ్రీనివాసన్‌ తెలిపాడు. ‘భారత క్రికెట్‌ను మనోహర్‌ చాలా దెబ్బతీశాడు

అంతేకాకుండా బోర్డుకు ఆర్థికంగా కూడా నష్టం కలిగించాడు. ఐసీసీలోనూ మన ప్రాధాన్యాన్ని తగ్గించాడు. అందుకే అతడు వైదొలగడంతో బీసీసీఐతో సంబంధమున్న ప్రతీ ఒక్కరు సంతోషిస్తారు. అతడో భారత వ్యతిరేకి. ఇక కొత్త పాలకవర్గం ఏర్పడ్డాక మద్దతు దక్కదని తెలిసి పారిపోయాడు’ అని శ్రీనివాసన్‌ ఘాటుగా స్పందించాడు. కాగా శశాంక్‌ ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైనప్పటి నుంచే భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఆరంభించాడని బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్‌ షా విమర్శించాడు. భారత క్రికెట్‌కు తానెంత చేటు చేశాడో మనోహర్‌ ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరాడు.

అయితే క్రికెట్ లో దిగ్గజ దేశాలైన ఇండియా , ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ ల వల్లనే ఐసీసీ కి అధిక లాభం వస్తుంది అని , అందుకే ఆ మూడు దేశాలకు కూడా వచ్చే లాభాల్లో అధిక వాటా పంచాలని అప్పట్లో శ్రీనివాస్ చైర్మన్గా ఉన్నపుడు ఐసీసీ నిర్ణయించిధీ ..దీనివలన క్రికెట్ వళ్ళ అధిక ఆదాయం అందించే భారత బోర్డు కు ఐసీసీ లాభాల్లో ఎక్కువ వాటా వచ్చేది..అయితే శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ అయినా తర్వాత ఈ విధానానికి చరణమ గీతం పాడారు ..

దీనితో భారత క్రికెట్ బోర్డు వందల కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది ..అంతే కాకుండా ఈ ఏడాది చివర్లో జరగాల్సిన ఐసీసీ టి ట్వంటీ వరల్డ్ కప్ వాయిదా పడితే దాని స్థానంలో ఐపీయల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్న తరుణంలో ఐసీసీ చైర్మన్ గా ఉన్న మనోహర్ టి ట్వంటీ వరల్డ్ కప్ వాయిదాపై ఎటువంటి నిర్ణయాన్ని వెలువరించడం లేదు ..దీనితో బీసీసీఐ మనోహర్ విధానాలను బాహాటంగానే విమర్శించింది ..అందుకే ఇంకో సారి ఎన్నికయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా భారత బోర్డు వ్యతిరేకత వలన మనోహర్ పదవిని వదిలేసాడు ..

Tags :
|

Advertisement