Advertisement

  • ఆంధ్రా రంజీ క్రికెట్ టీమ్ మాజీ సభ్యుడు...కేటీఆర్ పేరుతో మోసాలు...

ఆంధ్రా రంజీ క్రికెట్ టీమ్ మాజీ సభ్యుడు...కేటీఆర్ పేరుతో మోసాలు...

By: chandrasekar Tue, 17 Nov 2020 3:05 PM

ఆంధ్రా రంజీ క్రికెట్ టీమ్ మాజీ సభ్యుడు...కేటీఆర్ పేరుతో మోసాలు...


ఆంధ్రా రంజీ క్రికెట్ టీమ్ మాజీ సభ్యుడు తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పేరు చెప్పుకుని మోసాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు. మంత్రి పీఏనంటూ పలువురికి ఫోన్‌లు చేసి మోసాలు చేస్తున్న ఆంధ్రా రంజీ మాజీ క్రికెటర్ నాగరాజును.. తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తాను మంత్రి పీఏనని.. పేద క్రికెటర్లకు సాయం చేయలంటూ ఓ ఫార్మా కంపెనీకి టోకరా వేసే ప్రయత్నం చేశాడు. అతడి మాట తీరుపై అనుమానం వచ్చి సదరు కంపెనీ ప్రతినిధులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం నాగరాజును అరెస్ట్ చేశారు. నాగరాజు గతంలోనూ ఇలాంటి మోసాలు చేసి పలువురి నుంచి లక్షల్లో మోసం చేసాడు. తెలంగాణ, ఏపీలో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి.

గతంలో పొల్యూషన్ బోర్డులో ఉన్నతాధికారులు తనకు తెలుసని కలరింగ్ ఇచ్చి.. నోటీసులు ఇవ్వకుండా చూస్తానని చెప్పి.. ఓ ఫార్మా కంపెనీ వద్ద రూ.15 లక్షలు కాజేశాడు. గత ఏడాది డిసెంబరులో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి కాల్ చేసి.. ఏపీకి చెందిన ఓ నిరుపేద క్రికెటర్‌ అండర్19 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడని అతడిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరాడు. రూ.3.3 లక్షలు కావాలని కోరడంతో.. మోసాన్ని గ్రహించి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు గతంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరు వాడుకుని మోసాలకు పాల్పడ్డాడు. అప్పట్లో ఇది సంచలన సృష్టించింది. ఓ వ్యక్తికి కాల్ చేసి తాను ఎమ్మెస్కే ప్రసాద్‌నని చెప్పి రూ.2.88 లక్షలు వసూలు చేశాడు. మరో సొసైటీ నుంచి కూడా రూ.3.88 లక్షల మేర టోకరా పెట్టాడు. ఆ క్రమంsAzలో పలువురి నుంచి ఎమ్మెస్కేకు ఫోన్లు వెళ్లాయి. నీ పేరుతో ఎవరో డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పడంతో.. ఆయన పోలీసులను ఆశ్రయించారు. అనంతరం పోలీసులు నాగరాజను అరెస్ట్ చేశారు. ఇలా పలుమార్లు అరెస్టైనా.. అతడికి బుద్ధి రావడం లేదు. బెయిల్‌పై బయటకొచ్చి మళ్లీ మోసాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు.

నాగరాజు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం యవ్వారిపేట. వయసు 25 ఏళ్లు. ఎంబీఏ వరకు చదువుకున్నాడు. గతంలో ఆంధ్రా రంజీ టీమ్‌లో ఉన్న సమయంలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. 2006లో అండర్-14 విశాఖ జట్టుకు ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2014లో ఆంధ్రా రంజీ జట్టకు ఎంపికై.. పలు మ్యాచ్‌లు ఆడాడు నాగరాజు. ఇక 2016లో నెట్స్‌లో ఏకధాటిగా 82 గంటల పాటు బ్యాటింగ్ చేసి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నాడు. నాగరాజు ఆటకు ముగ్ధులై ఎంతో మంది దాతలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కానీ ఆ డబ్బులతో జల్సాలు చేసి చెడు మార్గంలో వెళ్లాడు. బంగారం లాంటి భవిష్యత్‌ను నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రముఖల పేరిట మోసాలకు పాల్పడుతూ నేరస్తుడయ్యాడు.

Tags :
|

Advertisement