Advertisement

  • కాన్సర్ వల్ల నా కెరీర్ ఊహించని మలుపు తిరిగింది ..యువరాజ్ సింగ్

కాన్సర్ వల్ల నా కెరీర్ ఊహించని మలుపు తిరిగింది ..యువరాజ్ సింగ్

By: Sankar Fri, 07 Aug 2020 5:38 PM

కాన్సర్ వల్ల నా కెరీర్ ఊహించని మలుపు తిరిగింది ..యువరాజ్ సింగ్



ఇండియన్ స్టార్ అల్ రౌండర్ క్రికెట్ కెరీర్ ను 2011 ప్రపంచ కప్ కు ముందు , తర్వాత అని విభజించవచ్చు ..2011 ప్రపంచ కప్ వరకు టీంఇండియాలో స్టార్ ఆటగాడిగా ఒక వెలుగు వెలిగిన యువి , 2011 ప్రపంచ కప్ లో కీలక పాత్ర పోషించి మాన్ అఫ్ ది టోర్నీ గా నిలిచాడు ..అయితే అదే ప్రపంచ కప్ లో యువీకి కాన్సర్ ఉన్న విషయం తేలింది ..దీనితో ఒక్కసారిగా యువి కెరీర్ అంధకారంలో పడిపోయింది ..ఇదే విషయం అయి యువి తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడాడు

జీవితంలో వచ్చిన ఉహకందని మలుపు కారణంగానే క్రికెట్‌కు దూరమయ్యానని ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఎలా ఉన్నా తన క్రీడా జీవితాన్ని ఎంతో ఆనందిస్తానన్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువరాజ్ తన క్రికెట్ కెరీర్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ‘ మొదట మిడిల్ ఆర్డర్‌లో ఆడటం కొంచెం ఇబ్బందిగా ఉండేది. నా పూర్తి సత్తా చూపలేకపోయేవాడిని. అయితే గంగూలీ రిటైర్‌మెంట్ తరువాతే మంచి అవకాశం వచ్చింది. సత్తా చాటేందుకు ఎన్నో మార్గాలు కనిపించాయి..

కానీ జీవితం మాత్రం క్యాన్సర్‌ కారణంగా ఉహించని మలుపు తిరిగింది. అలా జరగక పోతే భారత జట్టు తరుపున మరి కొన్ని మ్యాచ్‌లు ఆడేవాడిని. ముఖ్యంగా టెస్ట్‌లపై ఎక్కువ దృష్టి సారించేవాడిని. ఏది జరిగిన ఓ ఆటగాడిగా నా ప్రయాణం ఎంతో సంతోషాన్ని కలిచింద’ని యువరాజ్ పేర్కొన్నాడు.

Tags :
|
|
|

Advertisement