Advertisement

  • 6 నెలల భయాందోళనకు స్వస్తి ..బోనులో చిక్కిన చిరుత

6 నెలల భయాందోళనకు స్వస్తి ..బోనులో చిక్కిన చిరుత

By: Sankar Sun, 11 Oct 2020 1:04 PM

6 నెలల భయాందోళనకు స్వస్తి ..బోనులో చిక్కిన చిరుత


గత 6 నెలలుగా రాజేంద్రనగర్‌ వాసులను భయాందోళనకు గురిచేస్తున్న చిరుత పులి ఎట్టకేలకు పట్టుబడింది. రాజేంద్ర నగర్‌లోని వాలంతరి వ్యవసాయ క్షేత్రంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.

రెండు రోజుల క్రితం అధికారులు ఈ బోను ఏర్పాటు చేశారు. ప్రతి 10–15 రోజులకు ఒక్కసారి కనిపిస్తూ హల్‌చల్‌ చేస్తున్న పులి పట్టుబడటంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికే లేగదూడలు, ఆవుల మంద, మేకల మందలపై దాడి చేసిన చిరుత గత శుక్రవారం రాత్రి మరోసారి వాలంతరీ ప్రాంతంలోని డైరీఫామ్‌లోకి చోరబడి రెండు లేగదూడలను చంపివేసింది.

వాలంతరి వ్యవసాయ క్షేత్రంలో పట్టుబడిన చిరుతను అటవీ అధికారులు నెహ్రూ జువాలాజికల్‌ పార్కుకు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత వారం పాటు చిరుత అక్కడే ఉండనుంది. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ ఉందని భావిస్తే.. నల్లమల అడవుల్లో దానిని వదిలివేస్తారని సమాచారం.

Tags :
|

Advertisement