Advertisement

  • అజ్ఞానమనే చీకటి లో ఉన్నవారికి, విజ్ఞానమనే దారిని చూపే వారే గురువు...

అజ్ఞానమనే చీకటి లో ఉన్నవారికి, విజ్ఞానమనే దారిని చూపే వారే గురువు...

By: chandrasekar Sat, 05 Sept 2020 5:39 PM

అజ్ఞానమనే చీకటి లో ఉన్నవారికి, విజ్ఞానమనే దారిని చూపే వారే గురువు...


జీవితాల్లో వెలుగులు నింపే వారే గురువులు. గురువుల అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు. ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీన మన జీవితాల్లో వెలుగులు నింపుతున్న టీచర్లను స్మరించుకుంటూ టీచర్స్ డే జరుపుకుంటున్నాము . ప్రపంచ వ్యాప్తంగా టీచర్స్ డే ను అక్టోబర్ 5న జరుపుకుంటే భారతదేశంలో మాత్రం సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించుకోవడం జరుగుతుంది . భారతదేశంలో సెప్టెంబరు 5 టీచర్స్ డే వేడుకలు జరుపుకోవడానికి వెనుక ఎన్నో కారణాలున్నాయి.

స్కూళ్ళు, కాలేజీల్లో వేడుకలు

1962 వ సంవత్సరం నుండి సెప్టెంబర్ 5వ తేదీన ప్రతి ఏడాది డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజున ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆరోజు మనకు విద్యా బోధన చేసిన గురువులను స్మరించుకుంటాము. మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన, మనం ఉన్నతంగా ఎదగడానికి తోడ్పాటు నందించిన గురువులను గుర్తు చేసుకొంటాము. వారిని పూజిస్తాము.

గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ గురువులను స్మరించటమే కాకుండా టీచర్స్ పై ఉన్న భక్తి ప్రస్పుటం అయ్యేలా పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటాం. ఇక పాఠశాలలు, కళాశాలలలో సందడే సందడి. భారత రాష్ట్రపతిగా పని చేసిన డాక్టర్ . సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప గురువు అసలు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజునే ఎందుకు టీచర్స్ డే గా జరుపుకుంటాము అన్నది చాలా మంది మనసులోని ప్రశ్న.

ఇక దానికి జవాబు ఈ కథనంతో అర్ధం అవుతుంది. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా పని చేశారు. 1988లో తిరుత్తణిలో ఆయన జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి ఫిలాసఫీ లో మాస్టర్ డిగ్రీ చదువుకున్నారు. కలకత్తా, మైసూర్ యూనివర్సిటీ లలో ఆయన లెక్చరర్ గా పనిచేశారు. చాలా మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు.

తన పుట్టిన రోజు వేడుకలు వద్దన్న గురువు అందుకే ఇలా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ రోజు తన పుట్టినరోజును జరుపుకోవాలని కోరుకోలేదట. విద్యార్థులు ఎవరైనా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామని ఆయనని అడిగితే వద్దని చెప్పే వారట. విద్యార్థులు అంటే అమితమైన ఇష్టాన్ని ప్రదర్శించే ఆయన, విద్యార్థులు గురువుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని చెప్పేవారట.

అందుకే ఆయన పుట్టిన రోజున అందరూ ఉపాధ్యాయులను గౌరవిస్తూ టీచర్స్ డే వేడుకలను జరుపుతున్నారు. అది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆనవాయితీగా వస్తుంది. మహర్షి , గొప్ప గురువు సర్వేపల్లి గురించి మహనీయుల అభిప్రాయాలు భారతదేశంలో ఆనాడు ఉన్న మత ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకడమిక్ తాత్విక స్థాయికి తీసుకువెళ్ళిన గొప్ప పండితులు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతి కి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ అందరూ గురువులకే గురువుగా భావించేవారు. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మాగాంధీ కీర్తించారు. యుగ పురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండి అని పిలిస్తే యుగపురుషుడే వచ్చారు అని సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉద్దేశించి కీర్తించారు హోవెల్. నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి అంటూ సోవియట్ అధినేత స్టాలిన్ ఆయన గొప్పతనాన్ని చాటారు.

Tags :

Advertisement