Advertisement

  • నీట మునిగిన ప్రతి ఇంటికీ రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం: కెసిఆర్

నీట మునిగిన ప్రతి ఇంటికీ రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం: కెసిఆర్

By: chandrasekar Tue, 20 Oct 2020 09:16 AM

నీట మునిగిన ప్రతి ఇంటికీ రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం: కెసిఆర్


భారీ వర్షలతో హైదరాబాద్‌ నగరం నీట మునిగిన విషయం తెలిసిందే. ఇందుకుగాను సహాయక చర్యల్లో భాగంగా ప్రతి ఇంటికీ రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిసింది. వరదనీటి ప్రభావానికి గురైన హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికీ రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ సాయం పంపిణీని మంగళవారం నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు. వర్షాలు, వరదలతో ఇళ్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. లక్ష, పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలికవసతులకు యుద్ధప్రాతి పదికన మరమ్మతులు చేపట్టి మళ్లీ సాధారణ జనజీ వన పరిస్థితులు నెలకొ నేలా చూడాలని అధి కారులను సీఎం ఆదే శించారు. పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్‌ శాఖ కు ప్రభుత్వం రూ. 550 కోట్లు తక్షణమే విడుదల చేస్తుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఇప్పుడు కురిసిన భారీ వర్షాలు, వరదలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారని, వారిని ప్రభు త్వం ఆదుకుంటుందని ప్రకటించారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసిస్తున్న వారు ఎంతో నష్టపోయారని, ఇళ్లలోకి నీరు రావడంతో బియ్యం సహా ఆహార పదార్థాలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన వందేళ్లలో ఎన్నడూ రానంత భారీ వర్షం హైదరాబాద్‌ నగరంలో కురిసింది. ప్రజలు అనేక కష్టనష్టాలకు గురయ్యారు. ముఖ్యంగా నిరుపేదలు, బస్తీల్లోని వారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎక్కువ కష్టాల పాలయ్యారు. వారిని ఆదుకోవడం ప్రభు త్వ ప్రాథమిక విధి. కష్టాల్లో ఉన్న పేదలకు సాయం అందించడంకన్నా ముఖ్యమైన బాధ్యత ప్రభుత్వానికి మరొకటి లేదు. అం దుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇం టికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం అని సీఎం కేసీ ఆర్‌ వెల్లడించారు.

సహాయక చర్యల్లో భాగంగా హైదరాబాద్‌ నగర పరి ధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సహాయం అందించే కార్య క్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు సాయం అందించడాన్ని అతిముఖ్య మైన బాధ్యతగా స్వీకరించి నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్‌ అందరూ భాగస్వాములు కావాలన్నారు. సహాయం అందించడానికి ఈ విధంగా చర్యలు చేపడుతారు. ఇంటి లొకేషన్‌కి సంబంధించిన జీయో–కోర్డినేట్స్‌తో పాటు కుటుంబ వివరాలను ప్రత్యేక మొబైల్‌ యాప్‌లో రికార్డు చేస్తారు. లబ్ధిదారుల తెల్ల రేషన్‌ కార్డు/ఆధార్‌ కార్డు నంబర్‌ తీసుకుంటారు.

ప్రణాళిక కచ్చితంగా అమలు చేయడం కోసం ఒక కుటుంబం ఒకేసారి ఆర్థిక సహా యం పొందేలా చర్యలు. ఆర్థిక సహాయం అందినట్టు కుటుంబ పెద్ద నుంచి రసీదు తీసుకుంటారు. ప్రత్యేకాధికారి, జీహెచ్‌ఎంసీ అధికారి, రెవెన్యూ/ఇతర శాఖల అధికారులతో కూడిన అంతర్‌ శాఖ త్రిసభ్య కమిటీని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఏర్పాటు చే యాలి. జీహెచ్‌ఎంసీ చుట్టూ ఉన్న ఇత ర పురపాలికల్లో ఆర్థిక సహాయం పంపిణీకి సంబంధిత జిల్లా కలెక్టర్‌ స్థానిక పురపాలికను సంప్రదించి త్రిసభ్య కమి టీని ఏర్పాటు చేయాలి. ఆర్థిక సహా యం దుర్వినియోగం కాకుండా నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు అందేలా ప్రత్యేక అధికారి బాధ్యత తీసుకోవాలి. తక్షణమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వారం రోజుల్లో పూర్తిచేయాలి అని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ జారీచేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దీనివల్ల బాధితులకు సహాయం అందినట్లవుతుంది.

Tags :

Advertisement