Advertisement

10వేల కోట్లతో ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్స్...

By: chandrasekar Tue, 24 Nov 2020 11:45 AM

10వేల కోట్లతో ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్స్...


రాష్ట్రంలో ఆహారశుద్ధి యూనిట్లపై పెద్ద ఎత్తున డబ్బు వెచ్చిస్తున్నందున యూనిట్లన్నీ అత్యుత్తమ ప్రమాణాలతో నడుపుతూ రైతులకు అండగా నిలవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంప్‌ కార్యాలయంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. రైతుభరోసా కేంద్రాల పరిధిలో గోడౌన్లు, జనతా బజార్లు, ప్రాథమిక ఆహార ఉత్పత్తుల శుద్ధి, రెండోదశ శుద్ధి వంటి కార్యక్రమాలకు రూ.10వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరిస్తూ.. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా రైతులు అధికంగా పండించే పంటల వివరాలను సేకరించామని, ఆ మేరకు25 ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు రూ.2,900కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. సీఎం స్పందిస్తూ.. ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు విశ్వసనీయత ఉన్న సంస్థలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు.

‘రైతుకు మంచి ధరలు అందించే లక్ష్యంతో అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఫలానా ధరకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని రైతులకు ముందే చెప్తున్నాం. కనీస గిట్టుబాటు ధర రాకపోతే, ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అలా కొన్న వాటికి అదనపు విలువ జోడించడం చాలా ముఖ్యం. దీని కోసం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, క్లస్టర్లు ఏర్పాటు చేయాలి’ అని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి: ‘అభయం’ యాప్‌ ప్రారంభం సందర్భంగా విశాఖ జిల్లా రవాణా శాఖ అధికారులు అధికార పార్టీ పట్ల భక్తిని చాటుకున్నారు. వైసీపీ పతాకం రంగులతో తయారుచేసిన బ్యాడ్జీలను ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :
|
|
|

Advertisement